పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఈ నినాదం సిగరెట్ ప్యాకెట్లపై ఉంటుంది. అయినా తాగే వాళ్లు తాగుతూనే ఉంటాయి. కానీ.. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం కొత్త ఐడియాలు అమలు చేస్తుంటుంది. అందుకే కొన్నాళ్ల క్రితం సిగరెట్లపై గొంతు క్యాన్సర్ రోగుల చిత్రాలు పెద్దగా వేయించడం ప్రారంభించారు. సినిమా హాళ్లలో సినిమాలకు ముందు తప్పనిసరిగా నా పేరు ముఖేష్‌ అనే యాడ్‌ వచ్చేది.. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పొగాకు వినియోగం మాత్రం తగ్గడం లేదు.


సిగెరట్ వినియోగం, గుట్కా, నమిలే పొగాకు వీటి వినియోగాన్ని తగ్గించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే ఇప్పుడు కేంద్రం పొగాకు వినియోగం తగ్గించేందుకు ప్రచారం డోస్‌ను మరింత పెంచాలని నిర్ణయించింది. పొగాకు వినియోగం అంటే అకాల మరణం అంటూ ఇప్పుడు మరో కొత్త నినాదాన్ని పొగాకు ఉత్పత్తులపై రాయాలని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పొగాకు ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్‌పై... రోగుల ఫోటోల సైజులు కూడా పెంచాలని నిర్ణయించింది.  


ఇకపై అన్ని పొగాకు ఉత్పత్తులపై పెద్ద ఫోటో... అకాల మరణం వార్నింగ్‌ ఉండాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సిగరెట్లు, బీడీలు సహా.. అన్ని పొగాకు ఉత్పత్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టంచేసింది. అయితే.. ఈ ఉత్తర్వులువచ్చే డిసెంబర్‌ ఒకటి నుంచి.... అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. పొగాకు ఉత్పత్తులపై ముద్రించే హెచ్చరిక ఫోటో పరిమాణం కూడా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టంగా  పేర్కొంది.


అయితే..అసలు ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎవరైనా పొగాకు వినియోగదారులు తగ్గుతున్నారా.. లేదా అన్న దానికి ఏమైనా సర్వేలు ఉన్నాయో లేదో తెలియదు.. కానీ..అసలు ఇలాంటి ప్రమాదకరమైన పొగాకు పదార్థాలను నిషేధిస్తే మంచిది కదా అంటున్నారు కొందరు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: