పూర్వంరోజుల్లో ఉన్న ఆహార అలవాట్ల వల్ల,పిల్లలు,పెద్దలు బాహుబలి అంత బలంగా ఉండేవారు.ఎంతటి బరువును అయినా ఇట్టే ఎత్తేవారు.కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు సరియినా ఆహార నియమాలు పాటించక,ఏ చిన్న పనిచేసినా అప్పుడే అలసిపోవడం,నీరసం,నిస్సత్వతో బాధపడుపడుతుంటారు.దీనికి కారణం ఎలాంటి న్యూట్రియన్స్ లేని జంక్ ఫుడ్ తినడం,శారీరక శ్రమ లేకపోవడం,అవుట్డోర్ గేమ్స్ ఆడకపోవడం వంటివి చెప్పవచ్చు.ఇలాంటి పిల్లల్లో ఎనర్జీ బూస్ట్ చేయడానికి పూర్వం తాగే అంబలిలే చాలా బాగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తూన్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

చద్దన్నం..
పిల్లలకు అల్పాహారంగా చద్దన్నం పెట్టడం వల్ల, అందులోని విటమిన్ సి వారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.దానికోసం రాత్రిపూట కొంచెం ఎక్కువగా అన్నం వండుకొని,అందులో వేడిచేసిన పాలను వేసి, పెరుగుతో తోడు పెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే దానిని ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,ఉప్పు వేసి బాగా కలిపి,పిల్లలకు తినిపించడం వల్ల,అల్పాహారం కంటే ఎక్కువ శక్తి ఇందులో లభిస్తుంది.

జొన్న అంబలి..
చిరుధాన్యాలలో ఒకటైన జొన్నలను పిండిగా చేసుకొని, అంబలి తయారుచేసుకోని త్రాగడం వల్ల అందులోని ఐరన్,క్యాల్షియం అధికంగా లభించి పిల్లలు అధికంగా స్ట్రాంగ్ అవుతారు.దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి.అందులో మూడు గ్లాసుల నీళ్లు పోసి,ఉండలు లేకుండా కలపాలి.తర్వాత కాస్త ఉప్పు వేసి,15 నిముషాల పాటు ఉడికించాలి. అ తర్వాత చల్లబరిచి,ఉల్లిపాయలు,నిమ్మరసం కలుపుకొని తినాలి.ఇది వేసవితాపాన్ని కూడా తగ్గిస్తుంది.

రాగిసరి..
దీనిని రాగిసరి లేదా రాగిఅంబలి అంటారు. ఈ రాగిపిండితో తయారు చేసే రాగిఅంబలిని,ఆరు నెలలు నిండిన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తీసుకోవడం చాలా మంచిది.ఇందులోని ఐరన్, క్యాల్షియం,పొటాషియం మరియు మెగ్నీషియం అధిక బలాన్ని అందిస్తాయి.దీనికోసం ఒక స్పూన్ రాగిపిండి  తీసుకొని,అందులో మూడు స్పూన్ల నీళ్లు వేసి,స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి.ఇది బాగా ఉడికిన తర్వాత తగిన మోతాదులో బెల్లం కానీ చక్కెర కానీ వేసికొని తాగాలి.దీనిని తరచూ మీ పిల్లలకి అందిస్తే,మిగతా పిల్లల కన్నా చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: