
ఇక చంద్రశేఖర్ మొదటి సినిమా రాజా మౌళి మొదటి సినిమా ఒక్కటే కావడం విశేషం. అదే స్టూడెంట్ నెంబర్ 1, ఇద్దరికి అప్పటి నుండి మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అప్పటి నుండి నేటి వరకు ఈయన మంచి అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక చంద్ర శేఖర్ వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇతని భార్య పేరు నిలీయ భవాని. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయక పాత్రల్లో నటిస్తుంది. కిక్ 2 , సైరా నరసింహ రెడ్డి, నాని జెంటిల్ మ్యాన్, రామ్ పండగ చేసుకో వంటి అనేక సినిమాలో నటించింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ లోను స్టార్ హీరోస్ అయినా విజయ్, అజిత్ ల చిత్రాల్లో నటించింది. ఇక వెండితెర పైన మాత్రమే కాకుండా బుల్లి తెర పైన సైతం పలు సీరియల్స్ లో నటించింది భవాని. చంద్రశేఖర్ కూడా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈటీవీ సీరియల్ శాంతి నివాసం లో నటించాడు. వీరిది ప్రేమ వివాహం. సినిమాల్లోకి రాకముందే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ సినిమాల్లోకి వచ్చాక చంద్రశేఖర్ ఉద్యోగం మానేసి సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేయడంతో భవానికి, చంద్ర శేఖర్ కి మధ్య గొడవలు జరిగి విడాకులకు దారి తీసింది.
చంద్రశేఖర్ సినిమాలతో బిజీ గా ఉంటున్న సమయంలోనే భవాని సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. చంద్రశేఖర్ కి భవానికి స్టార్ డం విషయంలోను గొడవలు ముదరడంతో విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక ఇప్పటికి మరో పెళ్లి చేసుకోకుండా వీరిద్దరూ సినిమాలే ప్రపంచం గా బ్రతుకుతున్నారు. చంద్ర శేఖర్ భవాని దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా అబ్బాయి క్రికెటర్ గా అవ్వాలనే ప్రయత్నంలో ఉండగా కూతురు మెడిసిన్ చదువుతుంది. ఎప్పటికైనా ఈ దంపతులు కలవని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.