తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించిన సమీరారెడ్డి 2014వ సంవత్సరంలో అక్షయ్ వార్డె అనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నారు. 2002 సంవత్సరంలో సమీరా రెడ్డి "మైనే దిల్ తుజ్కో దియా" చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె డర్నా మన హై, ముసాఫిర్, జై చిరంజీవా , టాక్సీ నంబర్ 9211, అశోక్ , రేస్ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆమె సినీ కెరీర్ కి అర్ధాంతరంగా ఎండ్ కార్డు పడిపోయింది. తన కెరియర్ సర్వ నాశనం కావడానికి కారణాలు ఏంటో సమీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుర్ర హీరో ని బాలీవుడ్ బడా స్టార్ లు కావాలని చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని నటీనటులు ఎవరైతే చిత్ర పరిశ్రమలో రాణిస్తారో వారిని టార్గెట్ చేసి చంపే బాలీవుడ్ బడా బాబులు చాలామంది ఉన్నారని ప్రముఖ నటీనటులు కూడా చెప్పుకొచ్చారు. బంధుప్రీతి తో తమ బంధువులు మాత్రమే చిత్రపరిశ్రమలో కొనసాగాలని కొందరు స్టార్లు మిగతా నటీనటులను అణగదొక్కేస్తారని సమీరారెడ్డి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు.

అయితే ఒక బాలీవుడ్ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించమని సమీరా రెడ్డి ని బలవంతం చేశారట. స్క్రిప్ట్ వినిపించిన సమయంలో ముద్దు సన్నివేశం గురించి ప్రస్తావించలేదు కదా? మరి ఇప్పుడేంటి ఇలా చెబుతున్నారు? అని సమీరారెడ్డి చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తే... ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. "నిన్ను సినిమా నుంచి తీసేయడం చిటిక వేసినంత పని" అంటూ బాగా బెదిరించారట. అంతేకాదు ఒక బాలీవుడ్ హీరో తనతో నటించడం చాలా బోరింగ్ గా ఉందని మొహం మీద చెప్పేసి తనని బాగా బాధించాడని ఆమె చెబుతూ వాపోయింది.

చివరికి సమీరారెడ్డి ని అప్రోచ్ కావడం చాలా కష్టమని లేనిపోని పుకార్లు సృష్టించి తన సినిమా కెరీర్ ని సర్వనాశనం చేశారని ఆమె చెప్పారు. నేపోటిజం తోపాటు క్యాస్టింగ్ కౌచ్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉందని ఆమె కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నేపోటిజం తో తనకు రావాల్సిన భారీ సినిమాలను కూడా చెడగొట్టి.. కేవలం తమ వాళ్లకు మాత్రమే దక్కేలా గా కొంతమంది చేశారని ఆమె వాపోయారు. ఇక ఆ తర్వాత తనకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: