నితిన్ నటించిన సినిమాల్లో ఎక్కువగా
కామెడీ పాత్రలే చేశారు.అవి కాకుండా ఆయన పూర్తిగా నటనతో మెప్పించిన సినిమాలు చాలా తక్కువ అందులో జయం , సంబరం లాంటి సినిమాలు ముందు ఉంటాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చి
నితిన్ సినిమాలు చేస్తున్నారు. అయితే
నితిన్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో యాక్టింగ్ గురించి బయట మాట్లాడారు . ఆ సినిమానే
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తున్న
చెక్ సినిమా.నితిన్ ఈ
సినిమా గురించి మాట్లాడుతూ
చెక్ సినిమా షూటింగ్ లో శారీరకంగా
కన్నా మానసికంగా ఎక్కువ కష్టపడ్డాను అని ఆయన అన్నారు. విషయం మీకు
సినిమా చూస్తే అర్థం అవుతుంది అని ,
చెక్ సినిమా అంతా జైల్ లోనే నడుస్తుంది అని
నితిన్ చెప్పారు. అయితే ఈ సినిమాలోని నటన ఆయన ఏ సినిమాలో ఇప్పటిదాకా చూసి ఉండం అని
నితిన్ చెప్పుకొచ్చారు.
అలానే ఈ
చెక్ సినిమా మీద ప్రత్యేక అంచనాలు ఉండటానికి ముఖ్యమైన కారణం
డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఆయన సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా అడకపోయిన కూడా చాలామంది ఆయన సినిమాలకి ఫాన్స్ ఉన్నారు. అనుకోకుండా ఒక రోజు , ఐతే , సాహసం లాంటి వైవిధ్యమైన సినిమాలని తెరఎక్కించిన
చంద్ర శేఖర్ యేలేటి గారికి ఒక్క హిట్ వస్తే ఆయన రేంజ్ మారిపోతుంది చాలామంది నమ్ముతున్నారు. ఆ హిట్ ఈ
చెక్ సినిమాతో రావొచ్చేమో అని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఏదిఏమైనా కూడా
చెక్ సినిమా సాధారణ ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలని పెంచుతుంది. ఇక ఈ
సినిమా ఎంతో హిట్ అవుతుందో అని మనకు విడుదల వరకు తెలీదు. ఇక
చెక్ సినిమాలో
హీరోయిన్ గా ప్రియ ప్రకాష్
వారియర్ నటించడంతో ఈ సినిమాకి ఆమె పెద్ద ప్లస్ అయింది