ఆచార్య సినిమా యొక్క ఫలితం దాదాపుగా ఖరారు అయిపోయినట్లే. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి ఈరోజు వరకు వసూళ్లు బాగానే ఉంటాయి. కానీ రేపటి నుంచి ఈ సినిమా ఎంత వరకు నిలబడుతుందో అన్నదే అసలు ప్రశ్న. కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని తీవ్ర నిరాశకు గురి చేసింది అని చెబుతున్నారు. మెగా అభిమానులు సైతం ఈ సినిమా ఎంతో అసంతృప్తి ఉంది. అయితే ఈ సినిమా చూసి నిరాశ చెందిన వాళ్లంతా కూడా ఫ్లాప్ క్రెడిట్  కేవలం డైరెక్టర్ మీదే వేయడం ఆశ్చర్యం గా ఉంది.  

సినిమా విడుదలైన దగ్గర నుంచి దర్శకుడు కొరటాల శివ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సినిమా ఫ్లాప్ అయితే దాని ఫ్లాప్ క్రెడిట్. జ దర్శకుడి మీద కి వచ్చేలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాలలో సినిమా ఫ్లాప్ అయితే హీరో హీరోయిన్లను కాకుండా దర్శకుడిను బాధ్యుడిగా చేయడం జరిగింది. ఆ విధంగా తొలిసారిగా కొరటాల శివ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చెందని ఈ దర్శకుడు ఇప్పుడు ఈ స్థాయిలో ఫ్లాప్ ను అందుకుని విమర్శలను పొందుతున్నాడు.

ఒక దర్శకుడి మీద ఇంతటి స్థాయిలో దాడులు జరగడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యత దర్శకుడిదే అయినా కూడా హీరో నిర్మాతల ల యొక్క బాధ్యత కూడా ఉంటుందని మర్చిపోవద్దు. చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమాకు కేవలం కొరటాల శివను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదు. ఎందుకంటే చిరంజీవి కి కూడా మంచి అనుభవం ఉంది. 150 సినిమాలు చేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని భారీ బ్లాక్ బస్టర్ హిట్ల ను సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆయన జడ్జిమెంట్ కూడా ఇప్పుడు రివర్స్ అయింది. అంటే ఈ సినిమా ఫ్లాప్ లో చిరంజీవి కూడా ఫ్లాప్ యొక్క బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. మెగా హీరోలతో సినిమాలు చేస్తే అది ఫ్లాప్ అయితే ఏ దర్శకుడికి అయినా ఈ విధమైన ట్రీట్మెంట్ జరుగుతుందని ఇప్పుడు మరొకసారి నిరూపితం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: