ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రతీ కార్యక్రమంలో కూడా హైపర్ ఆది కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది లేడు అనే ఆవేదన, అసహనం ప్రేక్షకుల్లో కనిపించేది.
కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే జబర్దస్త్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచేశాడు. ఆయన రీ ఎంట్రీ తో జబర్దస్త్ కి మళ్ళీ మునుపటి ఉత్సాహం, మునుపటి ఆదరణ కలగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నమోదైన రేటింగ్ ని బట్టి చూస్తుంటే హైపర్ ఆది ఎంట్రీ తో మంచి ఫలితం నమోదవుతుంది అని క్లారిటీ వచ్చేసింది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు. ఈ రెండు షోల్లో కాకుండా పండగ స్పెషల్ డాన్స్ కార్యక్రమాలు ఇలా ప్రతి చోటా కూడా హైపర్ ఆది ఉంటున్నాడు. ఈటీవీలో హైపర్ ఆది ఎలా అయితే మారాడో ఇప్పుడు స్టార్ మా లో కూడా అవినాష్ అలాగే ఉన్నాడు.

జబర్దస్త్ నుండి వెళ్లిన ముక్కు అవినాష్ మాటీవీలో బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని మరింతగా పెంచుకున్నాడు. ఇప్పుడు అతడి యొక్క క్రేజ్ అమాంతం పెరిగింది. శ్రీముఖితో ఉన్న సన్నిహిత్యంతో మొదట్లో ఆఫర్లు దక్కించుకున్న అవినాష్ ఇప్పుడు సొంత ప్రతిభతో స్టార్ మా లో స్టార్ గా నిలిచాడు. స్టార్ మా వారు ఏ కార్యక్రమం చేసినా కూడా అవినాష్ ముందు ఉంటున్నాడు. అవినాష్ లేకుండా కామెడీ కార్యక్రమం కానీ.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని కానీ స్టార్ మా వారు చేయడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ మా లో బిగ్గెస్ట్ కామెడీ స్టార్ గా అవినాష్ అవతరించాడు. ఆయన యొక్క క్రేజ్ మరియు ఆయన యొక్క కామెడీ టైమింగ్ స్టార్ మా వారు బాగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల సుడిగాలి సుదీర్ స్టార్ మా కి వెళ్ళాడు. అయినా కూడా సుదీర్ కంటే ఎక్కువగా అవినాష్ కనిపిస్తూ నవ్విస్తున్నాడు. మొత్తానికి అవినాష్ మరియు స్టార్ మా బంధం రోజురోజుకు పెరుగుతుంది.
ఈటీవీ తో హైపర్ ఆది యొక్క బంధం పెరిగినట్లుగానే సుడిగాలి సుదీర్ కంటే కూడా అవినాష్ స్టార్ మా బంధం పెరుగుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా వారు అవినాష్ కి భారీ పారితోషికం ఇస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే ఈటీవీ, మల్లెమాల వారు హైపర్ ఆదికి ఇచ్చే స్థాయిలో అవినాష్ కి పారితోషకం దక్కుతుంది అనేది బుల్లి తెర వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ప్రస్తుతం అవినాష్ స్టార్ మా పరివార్ సండే కార్యక్రమంలో కీలక కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు తన కామెడీతో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాడని స్టార్ మా నిర్వాహకులు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఆయన యొక్క కామెడీ అందరికీ నచ్చుతుందని, భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆయనతో ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నారు. ముందు ముందు అవినాష్ స్టార్డం మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది రేంజ్ లో కాకుండా అవినాష్ మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: