టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర సంగీత దర్శకుడుగా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. ఆయన తర్వాత వచ్చిన సంగీత దర్శకుడు తమన్ తన సంగీతంతో ప్రేక్షక లోకాన్ని ఎంతగానో అలరిస్తూ ఉండడంతో మేకర్స్ కూడా తమన్ నే తమ సినిమాకు  సంగీత దర్శకుడి గా పెట్టుకోవడానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ పై చాలా ఒత్తిడి నెలకొంది అని చెప్పాలి.

ఇంతటి ఒత్తిడిలో కూడా ఆయన పుష్ప సినిమాకు అందించిన సంగీతం కు ఎంతటి స్థాయిలో పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా సంగీతం పరంగా కూడా అందరిని ఆకట్టుకుంది. అవార్డులను కూడా భారీ స్థాయిలో అందుకున్న ఈ సంగీత దర్శకుడికి ఇకపై మంచి సినిమా అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా భావించారు.  అయితే కొంతమంది పెద్ద దర్శకులు ఈ సంగీత దర్శకుడు ఇంకా నమ్మకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అంత పెద్ద మ్యూజిక్ ఆల్బమ్ హిట్ ఇచ్చినా కూడా దేవిశ్రీప్రసాద్ ను తమ సినిమాలకు కంటిన్యూ చేయలేకపోవడం వెనక కారణం ఏంటా అని ఆయన అభిమానులు వెతకడం మొదలుపెట్టారు. కొరటాల శివ దేవిశ్రీని కాదని ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మొదటిసారిగా ఆచార్య చేసిన కూడా అది చిరంజీవి బలవంతం మీదే చేశాడు. ఇప్పుడు తదుపరి సినిమాను కూడా కొరటాల శివ దేవిశ్రీని పక్కనపెట్టి మరొక సంగీత దర్శకుడునీ పెట్టుకోవడం వెనక కారణమేంటో తెలియడం లేదు. కొరటాల శివ మాత్రమే కాదు మరో ఇద్దరు ముగ్గురు పెద్ద దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ తో గతంలో ఎక్కువసార్లు పనిచేసిన దర్శకులు సైతం దేవి శ్రీ ప్రసాద్ ను తమ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎంపిక చేయడం లేదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: