మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించి ,  ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని ,  హీరోగా నటించిన మూవీ లలో కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి వరుస విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం కూడా వరుస మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. రవితేజ ఈ సంవత్సరం మొదట రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి ,  మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని  అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇలా ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను నిరోత్సాహపరిచిన రవితేజ ఆ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ లో రవితేజ సరసన  రాజేష విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి రవితేజ ఈ సంవత్సరం మూడో మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అజనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ అయిన ఈ సంవత్సరం రవితేజ కు హిట్ ను అందిస్తూ ఉందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: