టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసమరణాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అలనాటి లెజెండ్ అయిన కృష్ణ ,కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోలు మరియు ఎన్నో రకరకాల పాత్రలు పోషించిన చలపతిరావు ,కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖులు సైతం ఈ మధ్యనే కన్నుమూశారు.తాజాగా అలనాటి హీరోయిన్ జమున కూడా కొన్ని అనారోగ్య కారణాలవల్ల కన్నుమూయడం జరిగింది. అప్పట్లో ఈమె ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించింది. అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ జమున. అలాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ చనిపోవడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

అయితే తాజాగా ఆమె మరణం పై కమెడియన్ అలీ షాకింగ్ కామెంట్లను చేయడం జరిగింది. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. నటి జమున గారు కేవలం హీరోయినే కాదు నిర్మాత అలాగే రాజకీయ రంగంలో కూడా ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఆమె మరణానికి గాను ఇప్పటికే చాలామంది  సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు మరియు ఎంతో మంది ఆమె అభిమానులు సంతాపం తెలపడం జరిగింది. అయితే ఇంతటి మహానుభావులు ఆమెకి సంతాపం తెలిపినప్పటికీ ఆమె చివరి చూపు చూడడానికి కూడా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రం రాకపోవడం చాలా బాధాకరం. ఈ మహాతల్లి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనందరినీ విడిచిపెట్టి తుది శ్వాస విడిచింది.

 ఈ మహానటి పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా మూగమనసులు. ఈ సినిమాలో ఆమె నటనతో ఎక్కడికో వెళ్లిపోయింది.. అలాంటి ఒక గొప్ప నటి చనిపోతే ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు మాత్రం రాలేదు.. అసలు ఇంత పెద్ద హీరోయిన్ చనిపోయిన సంగతి ఆ ఇండస్ట్రీ పెద్దలకి అసలు తెలుసా.. తెలియదు కాబోలు..తెలియదు కాబట్టి కనీసం ఆమె పార్దివదేహాన్ని కూడా చూడడానికి రాలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అలీ చేసిన కామెంట్లను విన్న చాలామంది అలీ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడాడు అని చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: