బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంజు ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఇతర కీలకమైన పాత్రల్లో కూడా నటించి నటుడుగా తనకంటూ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న సంజు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే యాష్ హీరోగా ... శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన  కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లో సంజు విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో సంజు క్యారెక్టర్ కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించడంతో ప్రస్తుతం ఈ నటుడు కి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి అదిరిపోయే క్రేజీ సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి  అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

మూవీ తో పాటు తమిళ హీరో తలపతి విజయ్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో కూడా సంజు ను ఒక కీలకమైన పాత్రలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సంజు వరస సౌత్ సినిమా అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: