టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. పోయిన సంవత్సరం చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచడు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించాడు. ఇలా పోయిన సంవత్సరం అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేకపోయిన చిరంజీవి ఈ సంవత్సరం ప్రారంభం లోనే సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాలను విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండడంతో ఈ మూవీ కి విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ చివరగా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఈ క్రేజీ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్మూవీ తర్వాత బి వి ఎస్ రవి కథతో పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనితో ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం ఉండే అవకాశం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: