ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ యంగ్ హీరో పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే విశ్వక్ సినిమాల కంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అయితే ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కున్న ఈ హీరోకి అవకాశాలు మాత్రం అసలు తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా తానే హీరోగా, దర్శకుడిగా మారి తీసిన 'దాస్ కా ధమ్కీ' అనే సినిమా ఉగాది కానుకగా మార్చి 22న విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ప్రస్తుతం ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

ఈ సినిమాలో విశ్వక్సేన్ డ్యూయల్ రోల్ లో నటించి అదరగొట్టేసాడు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనను కనపరిచాడు. దీంతో ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విశ్వక్సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ మాట్లాడుతూ..' ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కాళ్లు నిలవడం లేదని అంటారు కదా.. ఇప్పుడు నేను కూడా అలానే ఉన్నాను.

ఇక సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం ఎలా అనిపించింది అని అడగగా..' మొదట్లో నేను చేయగలనా అని అనిపించింది. కానీ సినిమాకి వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందం వేసింది. ఆ పాత్రకు నేను న్యాయం చేయగలిగాను అని అనుకుంటున్నాను' అంటూ సమాధానం ఇచ్చాడు.మరి త్వరలోనే మీ డైరెక్షన్లో మరో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అని యాంకర్ అడగగా..' లేదు.. చాలా సినిమాలకు ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చాను. ఆ నిర్మాతలు నా కోసం సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే డైరెక్షన్ చేస్తాను. వాటిల్లో దాస్ కా ధమ్కీ2, ఫలక్ నుమా దాస్2.. రెండు సినిమాల సీక్వెల్స్ తీయాలి. అయితే వీటిల్లో ఏ సీక్వెల్ ముందు వస్తుందో చెప్పలేను' అంటూ విశ్వక్సేన్ బదులిచ్చాడు. అయితే ఈ యంగ్ హీరో చెప్పిన దాని ప్రకారం ఫలక్ నుమా దాస్ అలాగే దాస్ కా ధమ్కీ.. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ ని మాత్రం అతనే డైరెక్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: