అసలు జయాపజయాలతో ఎలాంటి సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న యువ కథానాయకుల్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకడు. గత సంవత్సరం మూడు సినిమాలతో టాలీవుడ్ ని పలకరించిన అతను.. కొత్త సంవత్సరంలో ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు అతను 'మీటర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. మరి మీటర్ సినిమాలో మ్యాటర్ వుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వందల కోట్లు పెట్టి 'పుష్ప' లాంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న మైత్రీ సంస్థ నుంచి 'మీటర్' అనే చిత్రం ఎలా  థియేటర్ వరకు వచ్చిందో ఎంత ఆలోచించినా అంతుబట్టదు. కొన్ని దశాబ్దాల ముందు చూసినా కూడా పక్కా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా ఇది. ఇక ఒక మామూలు పోలీస్.. పెద్ద పొలిటీషియన్ని ఢీకొట్టి అతణ్ని ఆటాడించే కమర్షియల్ ఫార్మాట్లో ఈ రోజుల్లో సినిమా తీసి మెప్పించగలం అని నమ్మిన మీటర్ టీంను చూసి ఏమనాలో అర్ధం కాదు.


అసలు ఈ సినిమా మొత్తంలో బాగుంది.. కొత్తగా ఉంది అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేదు. వరస్ట్ సినిమా 'మీటర్'.కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూస్తే విరక్తి పుట్టక తప్పదు.తన హావభావాలతో విసిగించేస్తున్నాడు. 'మీటర్'లో కిరణ్ బాగా నటించాడు అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేదు. కొంచెం హీరోయిన్ అతుల్య పర్వాలేదు అనిపించింది. ఇక విలన్ పాత్రధారి నటన గురించి చెప్పడానికి అంతగా ఏమీ లేదు. వినయ్ వర్మ లాంటి టాలెంటెడ్ నటుడిని ఇందులో పెట్టి పూర్తిగా వృథా చేశారు. హీరో సహాయకుడి పాత్రలో సప్తగరి నుంచి కూడా ఎలాంటి ఉరుములు మెరుపులు లేవు. ఇక పోసాని.. మిగతా నటీనటులంతా కూడా సాధారణ పాత్రల్లోనే సరిపెట్టుకున్నారు.కిరణ్ అబ్బవరం ఖచ్చితంగా తన నటనని ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదంటే అతనికి దారుణమైన ట్రోల్స్ తప్పవు. అతని మాట్లాడే మాటలకి చేసే రొటీన్ సినిమాలకి ఎలాంటి పొంతన లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: