
ఇండస్ట్రీలో నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొదట నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఫోటోలను సైతం తన సోషల్ మీడియా నుంచి తొలగించి నిహారికను అన్ ఫాలో చేశారు.. అలా చేసిన వెంటనే నిహారిక కూడా తన భర్త యొక్క అన్ని ఫోటోలను కూడా తొలగించి ఇంస్టాగ్రామ్ లో అతనిని అన్ ఫాలో చేసింది.. ఈ విషయాలన్నీ ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమేనంటూ వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసే పనుల వల్ల చైతన్య కుటుంబం విసిగిపోయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
చైతన్య కుటుంబానికి నిహారిక సినిమాలలో నటించడం అసలు ఇష్టం లేదట. అయితే ఇప్పటివరకు అటు మెగా కుటుంబం కాని చైతన్య కుటుంబం కాని ఈ విడాకుల పైన ఏవిధంగా ప్రకటించలేదు. కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రం సైలెంట్ గా ఉండడంతో విడాకుల వార్తల పైన మరింత అనుమానాలు పెంచేలా కనిపిస్తున్నాయి. తాజాగా నిహారిక టీంకు ప్రొడక్షన్ బ్యానర్ పై కొత్త సినిమా ఆఫీసును మొదలు పెట్టింది అక్కడ కూడా తన భర్త చైతన్య అసలు కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూర్చింది చైతన్య కూడా ఫ్యాషన్ దుస్తుల ఫోటోలు షేర్ చేయడం జరిగింది దీంతో ఇరువురి మధ్య దూరం ఉందని అనుమానాలు పెరుగుతున్నాయి. మరి అసలు విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.