మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపు ఎద్దుకుంటున్న 'SSMB 28' మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్స్ నుంచి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి. తాజాగా సెట్స్ నుంచి మహేష్, పూజ హెగ్డే ల పిక్ లీక్ అయింది. సోషల్ మీడియాలో ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మూవీ సెట్స్ నుంచి పలుమార్లు ఫోటోలు లీక్ అవుతున్నాయి. అంతేకాదు మహేష్ లుక్స్, గెటప్, లొకేషన్ కు సంబంధించి వివరాలన్నీ ఫ్యాన్స్ కు ముందే తెలిసిపోతున్నాయి. 

ఇక ఈ లీకులు చిత్ర యూనిట్ ఈ పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మూవీ నుంచి మహేష్ పిక్స్ కొన్ని లీకై నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పిక్ లీకైంది. షూటింగ్లో మహేష్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో పూజ హెగ్డే లంగా పోనీలో కనిపించింది. అటు మహేష్ కూడా మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ పిక్ లో మహేష్ గ్రీన్ కలర్ చెక్స్ షర్ట్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇదే ఫోటోలో మహేష్ బాబు వెనకాల కొన్ని కాస్ట్యూమ్స్ ఉండడం కూడా కూడా గమనించవచ్చు. ఇక త్రివిక్రమ్ కూడా ఈ పిక్ లో మహేష్ బాబు పూజ హెగ్డేకి  ఏదో సీన్ వివరిస్తున్నట్టు ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

ఇక తాజాగా ఈ పిక్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇటీవలే మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ఆ పోస్టర్లో మహేష్ బాబు న్యూ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్.రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ మూవీస్ తర్వాత సుమారు 12 సంవత్సరాల గ్యాప్ తో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో నీ మూవీ రాబోతుండడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.వచ్చేయడానికి సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: