
మొదట మే 5వ తేదీన గోపీచంద్ నటించిన రామబాణం సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా హిట్ అవడం కోసం గోపీచంద్ చాలా కష్టపడ్డారు డైరెక్టర్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా డింపుల్ హయాతి నటించినది. ఒక సన్నివేశం కూడా కటింగ్ లేకుండా సెన్సార్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా థియేటర్లో విడుదల కాబోతున్నది. ఇక అదే రోజు అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఇద్దరి హీరోలకు కూడా సక్సెస్ అనేది చాలా అవసరమని చెప్పవచ్చు.
మరొక హీరో అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరోయిన్గా డైరెక్టర్ వెంకట ప్రభువు దర్శకత్వంలో వస్తున్న కస్టడీ చిత్రం మే 12వ తేదీన విడుదల కాబోతోంది.. అలాగే మే 18 వ తేదీన అన్ని మంచి శకునాలే సినిమా విడుదల కాబోతోంది. మే 19వ తేదీన సామజ వరగమన అనే సినిమా విడుదలకపోతే. అలాగే విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు-2 చిత్రం మే 19న విడుదల కాబోతోంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా మే 26వ తేదీన విడుదల కాబోతున్నది మరి ఈ చిత్రాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందో చూడాలి మరి.