పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందుతున్న సినిమా యొక్క షూటింగ్ ను పవన్ పూర్తి చేసుకున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితమే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది.

అలాగే పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై లో శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో త్వరలోనే మూవీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవన్ ... దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోయే మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత పవన్ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ స్టార్ట్ అయ్యా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: