మెగా మరియు నందమూరి కుటుంబాల మధ్య ఒకప్పుడు కోల్డ్ వార్ నడిచేది..అలాగే ఇద్దరి ఫ్యాన్స్ కూడా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చేవారని తెలుస్తుంది..కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.

ఇద్దరి అభిమానులు ఒక్కటే అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటించడం..ఆ తర్వాత బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లడం, ఇటు రాజకీయాల్లోనూ టీడీపీ కి పవన్ సపోర్ట్ గా ఉండడం తో మెగా మరియు నందమూరి అభిమానుల మధ్య మరింత బలం పెరిగింది.

ఈ క్రమం లో తాజాగా పవన్ కోసం బాలయ్య ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ నటిస్తున్న సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టాలి అని అనుకున్నారు. బాలకృష్ణ ఆటిట్యూడ్ కు ఇది సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా ఎంతో సంతోష పడ్డారు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసి ఉండేవారని సమాచారం.. కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమా కు బ్రో టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు.

సముద్రఖ ని దర్శకత్వం లో నటిస్తున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుందని సమాచారం.ఆ పవన్ సినిమాకు బ్రో అనే టైటిల్ పెట్టడం తో.. తన సినిమాకు మళ్ళీ అదే పెడితే బాగోదు అని బాలకృష్ణ టైటిల్ విషయంలో వెనక్కి తగ్గాడని తెలుస్తుంది.. అనిల్ రావిపూడి కూడా ఈ విషయం లో బాలయ్యకు ఒక పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఈ సినిమా లో బాలయ్య పాత్ర కూడా ఎంతో కొత్తగా ఉండబోతుందని సమాచారం. సరికొత్త బాలయ్యని చూస్తారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: