ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా తమ సినిమాను రెండు పార్టులుగా తీయాలని తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాలో చెప్పాల్సిన విషయం ఎక్కువ ఉంటే ఎలాగు ఆడియన్స్ అలవాటు పడ్డారు కాబట్టి సినిమాను రెండు ముక్కలుగా చేసి చూపించాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పుష్ప 2, సలార్ ఇంకా ఒకటి రెండు సినిమాలు రెండు పార్టులుగా రానున్నాయి. ఇక ఇదిలాఉంటే ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) ని కూడా రెండు పార్టులుగా చేస్తారని టాక్.

మారుతి సినిమా రెండు పార్టులుగానా అని అవాక్కవుతున్నారు. కామెడీ, థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమా మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా రెండు పార్టులుగా చేస్తున్నారని టాక్. కానీ ఇందులో అసలు ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది.

కేవలం ఎవరో కావాలని ప్రభాస్ సినిమా రెండు పార్టులు అని మెసేజ్ వైరల్ చేస్తున్నారే తప్ప. మారుత్ ఈ సినిమాను కేవలం ఒక పార్ట్ గానే ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా హిట్ అయితే మాత్రం ప్రభాస్ తో మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడట మారుతి. అది మాత్రం చాలా పెద్ద సినిమా అని.. అది ఉంటే రెండు పార్టులు ఉండొచ్చని అంటున్నారు. ప్రభాస్ ఈ ఏడాది ఆల్రెడీ ఆదిపురుష్, సలార్ సినిమాలతో వస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి మారుతితో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ తర్వాతే ఉంటుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: