కెరటం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు సినీ రంగంలో ఉన్న కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి చెంతన నటించి టాలీవుడ్ ను షేక్ చేసింది. తన నమడు ఒంపుసొంపులతో సినీ రంగాన్ని ఊపేస్తూ... విపరీతమైన ఫాలోయింగ్ ను సాధించింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ సాధించింది. తనకు నచ్చిన చోట సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతూనే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ లైప్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటుంది.అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ మాల్దీవ్స్ కు వెళ్లింది. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తోంది. బీచ్ పక్కన విల్లాలో ఉంటూ తనకు నచ్చిన ఫుడ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలనన్నింటి ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది.అందులో రకుల్ ఫ్లోరల్.. జంప్ సూట్ వేసుకొని బీచ్ దగ్గర ఫొటోలు దిగింది. పైన కొప్పు కట్టుకొని పెద్దగా నవ్వుతూ ఫోజులు ఇచ్చింది. లైట్ మేకప్ వేసుకొని రెడ్ కలర్ స్లిప్పర్స్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.

తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని రెండు చేతుల్లో రెండు ప్లేట్లు పట్టుకొని నవ్వుతూ.. దిగిన ఫొటో అదిరిపోయింది. రకుల అందానికి నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు. పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.అదిరిపోయావు, చాలా అందంగా ఉన్నావు, హాట్ గా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు. అమెజింగ్ వ్యూ, సో బ్యూటిఫుల్, వ్యూ అదిరింది.. నైస్ స్మైల్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: