సింగర్ సునీత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే. సునీతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా సునీతకు ఊహించని స్థాయిలో ఆఫర్లు ఉండగా ఈ మధ్య కాలంలో ఆమె పరిమిత సంఖ్యలో ఆఫర్లకు మాత్రమే ఓకే చెబుతుండటం గమనార్హం. ఎస్పీ బాలు గురించి సునీత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఎస్పీ బాలు పుట్టినరోజు సందర్భం గా ఆయనను తలచుకుంటూ సునీత ఎమోషనల్ అయ్యారు. ఎస్పీ బాలుతో కలిసి దిగిన ఫోటోను సునీత సోషల్ మీడియా వేదిక గా పంచుకున్నారు. సునీత తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో నిన్నటి నిజం ఈరోజు జ్ఞాపకం అంటే ఎలా అని చెప్పుకొచ్చారు. బర్త్ డే గ్రీటింగ్స్ నేరుగా చెప్పుకునే లక్ లేకుండా చేసిన ఆ దేవుడిని ఎప్పటికీ నిందిస్తూనే ఉంటానని సునీత చెప్పుకొచ్చారు.

సింగర్ సునీత చేసిన పోస్ట్ కు దాదాపుగా 10,000 లైక్స్ వచ్చాయి. ఎస్పీ బాలు భౌతికంగా మరణించినా ఆయన పాటల రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈతరం ప్రేక్షకుల లో సైతం ఎంతోమందికి ఎస్పీ బాలు ఫేవరెట్ సింగర్ కావడం గమనార్హం. మిస్ యూ బాలు సార్ అంటు కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదిక గా అభిప్రాయాల ను వ్యక్తపరుస్తున్నారు.

సునీత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సునీత రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని తెలుస్తోంది. సునీత కెరీర్ పరం గా మరింత ఎదిగి మరిన్ని విజయాల ను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తి గా కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సునీత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసు కుంటారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: