
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తిరుగులేని క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఆర్య. 2003 లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అల్లు అర్జున్ 2004లో వచ్చిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా యూత్ ను ఆకర్షించాడు. ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత కాగా సుకుమార్ ఆ సినిమాతోనే మెగా ఫోన్ పట్టి టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయం అయ్యారు. ఆర్య సినిమా తీసే టైమ్ కు నిర్మాత దిల్ రాజు - శిరీష్ రెడ్డి పెద్ద నిర్మాతలు కాదు.. అది ఆ బ్యానర్ లో రెండో సినిమా. అప్పటికే బన్నీ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు. ఆ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలో ఏమిటో వీళ్లకు అర్థం కాలేదట.
ఎన్ని సార్లు అడిగినా అల్లు అరవింద్ చూద్దాం అనేవారట. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అరవింద్ దగ్గరకు వెళ్లారట. అప్పుడు అల్లు అరవింద్ ఇలా అన్నారట .. సినిమా నైజాంలో కోటి రూపాయలు చేస్తే నా కొడుక్కి 10 లక్షలు ఇవ్వండి , రెండు కోట్లు చేస్తే 20 లక్షలు , మూడు కోట్లు చేస్తే 30 లక్షలు .. నాలుగు కోట్లు చేస్తే 40 లక్షలు ఇవ్వండి అంతకుమించి ఇవ్వవద్దు సినిమా ఎంత చేసినా అని చెప్పారట. ఈ విషయాన్ని దిల్ రాజు సోదరుడు తన తాజా ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు