
భారత దేశానికి స్వర్ణయుగం రుచి చూపించిన గుప్త రాజుల పాలన (320-550 సిఈ) - ఆ గుప్త రాజుల కుల ప్రస్థావన తో నేటి వైశ్య కుల సమాజాన్ని "సామాజిక స్మగ్లర్లు" అని ఒక విద్యావంతుడు విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుని హోదాలో పనిచేసిన కంచె ఐలయ్య రాసిన పుస్తకం "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు" అంటూ సంబోధిస్తూ రాసిన పుస్తకానికి ఆధారంగా ఏమైనా ఋజువులు పునాదులు ఉన్నాయా?
పూర్తి శాఖాహారులైన గుప్తులు యుద్ధాలు చేశారు. కాని బీఫ్, పోర్క్, చేపలు తినలేదు. వ్యూహాలు పన్నారు. వియ్యాలు నెరిపారు. నాటి జంబూ ద్వీపమంతా వారి పాలన లోనే ఉంది.
1500 సంవత్సరాల
క్రితం ఎమి జరిగింది? ఎలా
జరిగింది? అన్నదానికి నేడు ఎలాంటి సాక్ష్యాధారాలను
చూపగలం? అసలు స్మగ్లర్లంటే నేర
చరితులనే అర్ధం. నేరాలతో వ్యాపారం చేసేవారనే కదా అర్ధం! నాటి
నుండి ఒక కుల సమాజాన్ని
నెరస్తులు అని నిర్ధారిస్తే - ఈ
మొత్తం కాలములోని పరిపాలకులను, భరించిన ప్రజలను నేరస్తులు గానే భావించాలి కదా!
"చంద్ర గుప్త మౌర్య" ని కాలములోని యుద్ధాలు చేసి విస్తరించిన భారతదేశం
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అసలు ఈ కథనం అవసరం నేడు ఉందా? ఈ మధ్య కాలములో గ్రీకు పాలకులు, ముస్లిం పాలకులు, చివరకు క్రిష్టియన్ పాలకులైన బ్రిటీష్ వాళ్ళు ఈ దేశాన్ని వంతుల వారీగా పరిపాలించారు. ఇంతమంది ఇన్నిరకాల పాలకులను రాజవంశాలను “సోకాల్డ్ కోమటోళ్ళు” ఎలా ఒప్పించి స్మగ్లింగ్ చేయగలిగారు అనేదే ప్రాథమిక ప్రశ్న? అందులో కంచె ఐలయ్య గారి మత పాలకుల పాలన కూడా ఉంది. మరైతే ఆయన మతం కూడా నేరగ్రస్థ ఔతుందికదా? భావస్వేచ్ఛ పేరుతో, ఏ వ్యక్తి, ఏ వర్గంపైనైనా ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయటం సబబేనా?
నేడు
వైశ్యులు రాజకీయంగా అతి బలహీనులు. "పూను
స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే" గురజాడవారు అన్నట్లు, స్పర్ధలను
సవరించవచ్చు కాని వైరములు ఇరు
హృదయాలను కలపలేవు. అందుకే “వైశ్య కులజుల” లో ఐఖ్యత లేక పోవటమే కారణం. చట్ట
ప్రకారం ఈ పుస్తకం టైటిలుకు, పుస్తకంలోని బాషణకు, బావనకు
రచయిత కంచె ఐలయ్య బాద్యుడౌతారు. ఈ టైటిలుకు రచయిత
నుంచి అంగీకార పత్రం లేకుంటే పబ్లిషర్
ఎమెస్కొ దూపాటి విజయ కుమార్ క్షమార్హుడు
కాదు.
కాని ఒక విదేశీ మతానికి ప్రచారం చేసే ప్రవృత్తి ఉన్న కంచె ఐలయ్య ఒక మతప్రచారకుడు మాత్రమే. రాజనీతి అర్ధశాస్త్ర చరిత్ర పరిశొదకుడు ఏ మాత్రం కాదు. మత దురహంకారి కాబట్టే "ఇంతకు బరితెగించాడు అంటే, దీని నేపధ్యంలో ఉన్న బరి తెగింపుకు ప్రధాన కారణం" ఏమిటి? అని తెలుసు కోవటం చాలా అవసరం. 76% హిందూ ప్రజలున్న సమాజం ఆగ్రహించ కుండా ఈ కల్లోలానికి కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షించటం భారత్ ప్రభుత్వ విధి.
ఏదేశంలో నైనా మైనారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలపట్ల వ్యతిరెఖత ప్రదర్శించరు. రాజ్యాంగం కూడా మెజారిటి ప్రజల ప్రయొజనాలు కాపాడాలి. లేకుంటే మెజారిటీ ప్రజల నుండి తిరుగుబాటు వస్తుంది. కాని ఇక్కడ జనాల చుట్టూ "కుల విభజన" కంచె వేసింది బ్రిటీష్ సమాజం. అక్కడే కంచె ఐలయ్య అడుగు పెట్టాడు.
ఈ మద్య ఐలయ్య వివిధ మీడియాలలో ఇచ్చిన వివరణల పరంగా చూస్తే ఆయన టార్గెట్ చేసిన సుదూర లక్ష్యం "నరెంద్ర మోడీ - అమిత్ షా" ద్వయం. కంచె ఐలయ్యకు వారిద్దరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా "చంద్రగుప్త చాణక్యులు" గా కని పించబట్టే ఆయన మాట్లాడితే "గుప్త సామ్రాజ్యం" అంటున్నాడు. గుప్తుల కులానికే చెందిన కోమటోళ్ళు అంటూ తన వ్యాసాంగం కొనసాగిస్తున్నాడు.
రాం మనొహర్ లోహియా
అతి దగ్గర లక్ష్యం "కోమటొళ్ళు" ఎందుకంటే కిరాణా దుకాణానికి ఆయన చిన్నతనములో "పిప్పరమెంట్" కోసం వెళితే" చేతి లో పైనుంచి ఆ పిప్పరమెంట్ ఈయన చేతిలోకి జారవిడిచిన కిరాణావ్యాపారి కోమటోడు" అయినందున వారిపై కోపం. అయినా ఈయన తనకై తాను అన్నట్లు "పంచముడు" కాదు. గొల్ల కురుమ కులాలు అంటరానివి కదా! అనాదిగా అంటరాని వారుగా చూడబడ్ద వారు "పంచములు" మాత్రమే. అంటే ఈయన చెప్పిన చిన్ననాటి "పిప్పరమెంట్ కథ శుద్ధ అబద్ధం"
అసలీ కథనములో ఐలయ్య లెక్క ప్రకారం "నాడు దేశాన్ని కోమట్లతో కలిపిన హిందువులను పాలించినందుకు, స్మగ్లర్లైన కోమటోళ్ళపై చర్య తీసుకొనందున, నేటి ముస్లిములు, నేటి క్రిష్టియన్లు కూడా శిక్షార్హులే" మీరంతా దానికి సిద్ధమైతే హిందువు లంతా సిద్ధమౌతారు. నాడు సమాజాన్ని పీడించిన ఎన్నో దురాచారాల నిర్మూలన జరిగింది. వితంతు వివాహం, సతీ సహ గమనం లాంటివి ఎక్కడో తప్ప కనిపించవు. అలాగే అంటరాని తనం కూడా మారు మూల పల్లెల్లో మాత్రమే ఉండొచ్చు.
దీనికి పరిహారంగా 70 సంవత్సరాల స్వతంత్రానంతర పాలనలో భారత్ డా: బి.ఆర్. అంబేద్కర్ సారధ్యంలోని "రాజ్యాంగ నిర్మాణ సంఘం" నిర్దేశించిన "రాజ్యాంగ సూత్రాలు" మూలాధారంగా రిజర్వేషన్ల ప్రయొజనాలు పొందుతున్నారు శూద్రులుగా పిలవబడ్ద దళితులు, పంచములు, ఇంకా వెనుకబడిన వర్గాలు.

ఈ 70 వత్సరాల కాలములో అగ్రవర్ణాలు అనబడ్డ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు (ఐలయ్య బాషలో కోమటొళ్ళు) ఏ రకమైన ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హతలేక పోవటంతో ఆర్ధికంగా నాటి దళితుల స్థాయికి పడిపోయారు. కొన్ని చోట్ల పంచముల స్థాయికి కూడా పడిపోయారు.
ఏ దేశంలోనైనా అభివృద్ది అంటే నిమ్న స్థితిలో
ఉన్నవాళ్ళు ఉచ్చ స్థితికి చేరటం.
కాని భారత్ లో మాత్రం ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు నిమ్ స్థితికి చేరటం.
ఎప్పుడో
గుప్తుల కాలంలో వైశ్యులు
ఏ నేరం చేశారో? కాని, నేడు కంచె
ఐలయ్య చేత సామాజిక స్మగ్లర్లు
అని పిలవబడు తున్నారు. నాటి కాలం, పరిస్థితులు
నేడులేవు. నిజం చెప్పాలంటే నేటి వైశ్యులు పిల్లలకు కులం అంటే తెలియకుండా
పెంచారు, పెంచుతున్నారు. "ఇప్పుడెవడో ఐలయ్యగాడొచ్చి వచ్చి కోమటొళ్ళు అంటే పిల్లలు అర్ధం
కాక ఆశ్చర్యపోతున్న సందర్భాలెన్నో?"
ఇలా బ్రహ్మణుల, వైశ్యుల నోటివద్ద కూడు రిజర్వేషన్ల పేరుతో లాగేసిన కంచె ఐలయ్య నిజంగా లాంటి వాళ్ళు హిందూ సమాజానికి చెందిన దళితులా? అసలు హిందువేనా? కానే కాదని సమాధానం. ఆయన వివిధ టెలివిజన్ చానళ్ళలో వాడే "ప్రీష్ట్-హుడ్" అనే పదమే చెపుతుంది. హిందువైన వారు "బ్రాహ్మణత్వం" అంటారు.
ఈ హిందూ దళితుడు, మతం మార్చుకున్న క్రిస్టియన్ - ఒకవైపు దళిత హిందువుగా భారత్ లో రిజర్వేషన్లతో చదువు, ఉద్యోగం, చివరకు ప్రమోషన్లు పొందుతూ మరో వైపు క్రిష్టియన్ మిషనరీల నేపధ్యంతో హిందూ సమాజంపై దాడి చేస్తున్నాడు. మరో ప్రక్క కమ్యూనిష్ట్ భావజాలంతో దేశ ప్రధానిని అధికార పార్టీ అధ్యక్షులైన మోదీ-షా లపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నాడు.
మరి తాను నిజాయతీ పరుడైతే విదేశీ వనిత సోనియా గాంధిని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించలేదేమి? ఇదంతా క్షుద్ర రాజ కీయం. దీనికి ఆయన వెనకున్న నేపధ్యం విదేశీ మిషనరీలు. వాటి నుండి వచ్చే ధనప్రవాహం. బాజపా పాలనలో ఈ రకమైన మతవ్యాప్తికై లభించే విదేశీ ధనానికి చెక్ పడటంతో ఆక్సీజన్ అందక ఈ కంచె ఐలయ్య షెపర్డ్ విలవిల్లాడుతున్నాడు. ఇంకేం ఐలయ్యల గుండెలకు రంద్రాలు పడ్డాయి. అందుకే మోదీ-షా పై ఆక్రోశం.
ఇక వాళ్ళకి మిగిలింది "డివైడ్ & రూల్" అందుకే నిట్టనిలువునా కులాల మద్య చిచ్చు పెట్టి హిందూ సమాజాన్ని (హిందూ సిద్ధాంతాన్ని మతం అనలేను - కారణం అది మతమైతే ఈ ఐలయ్య లాంటి వాళ్ళకు సౌదీ అరేబియాలో లాగా బహిరంగ ఉరి శిక్షపడి ఉండేది) ఈ జీవన విధానాన్ని నామరూపాలు చేయాలన్న కసి,కక్ష,కార్పణ్యం, దుగ్ద కారణం.
"బలహీనుడి ఆఖరి లక్ష్యం ఏడవటం" అందుకే అత్యంత బలహీనుడైన కంచె ఐలయ్య - తమకు రిజర్వేషన్లు సాధించి సహ కరించి, చట్టమయ్యెలా చూసిన రాం మనోహర్ లోహియా ఒక కోమటొడు అని కూడా తెలియని ఒక విద్యాఙ్జానశూన్యుడు నేడు వైశ్యులను "సామాజిక స్మగ్లర్లు" అనటం చూస్తే "పాలుబోసిన చేతినే కాటేసే పాము" అని అనవచ్చు.
రాజ్యాంగం కలిపించిన రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే. తస్మాత్ జాగ్రత్త. దళితులకు ద్రొహం చెయ్యకు నీ నీతిమాలినతనంతో. నీవేమీ బిఆర్ అంబెద్కర్ వి జ్యోతీరావ్ పూలే వి కావు, వారి వరసలో చెరాలను కుంటున్నావేమో? కారణం వారు కులాల మధ్య సఖ్యత కోరారు. నీలా కుల వినాశనాన్ని కోరలేదు. జన్మతః హిందువులై వారు స్వార్ధం కోసం మతం మారలేదు హైదవంలో ఉంటూనే అంటరానితనానికి వ్యతిరెఖంగా, సామాజిక వెనకబాటుతనాన్ని రూపుమాపటానికే ప్రయత్నించారు.
సాధారణంగా , ఈ దుర్లక్షణం ఎవరికి ఉంటుంది అంటే, "ఈ దేశ సమాజం నాది కాదు - చివరకు ఈ దేశం కూడా నాది కాదనే వాడికి మాత్రమే ఉంటుంది" కంచె ఐలయ్య హిందూసమాజానికి చెందరు అలాగే "శరీరం భారత్ దైనా — మనస్సంతా చైనా చుట్టూ పరిభ్రమించటమే.
సంపూర్ణ గ్రామీణ స్వరాజ్యమంటే ఏమిటో తెలుసా "కులవృత్తులు సజీవమై వర్దిల్లటమే" ఏ కులం వాడైనా తనకు నచ్చిన పని చేసుకొని ఆ కులం వాడవటమే. కుల వ్యవస్థ ఉద్దేశం తరతరాలుగా "పనిలో నైపుణ్యాన్ని" నేర్పటమే.