నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే.సభాపతి  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన రాజ్య సభ సమావేశాల మొదలయ్యాయి. ఈ శీతాకాల రాజ్యసభ సమావేశాలను  మొదలు పెట్టిన సభాపతి  వెంకయ్యనాయుడు రాజ్యసభ గొప్పతనాన్ని చరిత్రను వివరించారు. మనం చేసిన గొప్ప పనులను గుర్తుచేసుకొని వెన్నుతట్టుకునే  సమయం ఇది అంటూ రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చారు సభాపతి వెంకయ్యనాయుడు. కాగా నేడు రాజ్యసభ 250 సమావేశాన్ని జరుపుకున్నట్లు రాజ్య సభ సభాపతి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్య సభ సభ్యుల యొక్క గరిష్ట సంఖ్య   254 మంది అంటూ సభాపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో యొక్క  గొప్ప తనాన్ని చెప్పే అనేక కీలక ఘట్టాలకు రాజ్యసభ  సభావేదికగా  ఉన్నట్టు సభాపతి వెంకయ్య నాయుడు తెలిపారు. 

 

 

 

 అయితే పెద్దల సభగా పిలుచుకునే  రాజ్య సభ మొదటి సమావేశం 1953 మే 23న జరిగిందని సభాపతి వెంకయ్య నాయుడు తెలిపారు. 1953 నుంచి నేటి వరకు మొత్తం 240 సార్లు రాజ్య సభ సమావేశమైనట్టు  ఉపరాష్ట్రపతి రాజ్య సభ సభాపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మొత్తంగా ఇప్పుడు వరకు రాజ్యసభ 5, 466 పనిదినాలు పూర్తిచేసుకొనినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. 1952లో రాజ్యసభ కొలువుదీరిన నాటి నుంచి ఎన్నో చట్టాలను రూపొందించింది అంటూ వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నో గొప్ప చట్టాల రూపకల్పనకు వేదికగా రాజ్యసభ నిలిచిందని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన వ్యాసాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు వెంకయ్యనాయుడు. 

 

 

 

 కాగా  1981లో అక్టోబర్ 17న రాజ్యసభ సుదీర్ఘ సమావేశం జరిగింది సభాపతి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. రాజ్యసభలో ఇప్పటివరకు 3,117 బిల్లులను ఆమోదించినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. అంతేకాకుండా రాజ్యసభ మరింత మెరుగ్గా పని చేసేందుకు సభ్యులందరికీ పలు  సూచనలు చేశారు సభాపతి వెంకయ్యనాయుడు. ద్రవ్య  బిల్లును ప్రవేశపెట్టే సమయంలో తప్ప మిగతా సమయాల్లో రాజ్యసభ లోక్ సభ సభ్యులకు సమాన అధికారాలు ఉంటాయని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కాగా రాజ్యసభ సభ్యుల కాలం ఆరు సంవత్సరాలు అని అని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా మొదటిరోజు రాజ్యసభ గొప్పదనాన్ని గురించి చరిత్రను గురించి సభాపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: