
చెబితే వినని వారి వల్ల కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కరోనా వచ్చిన మొదట్లో లాక్‌డౌన్ పెట్టారు.. అది ఎత్తేసాక కేసులు పెరగడం మొదలయ్యాయి.. ఇప్పుడైతే ఊహించని స్దాయిలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ దశలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే పరిస్దితి ఏంటనేది సమాధానం లేని ప్రశ్న..
ఇకపోతే ఏపీలో కరోనా వీరంగం చేస్తుంది. నెల్లూరు జిల్లాలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. ఇప్పటికే కావలిలో కరోనా బారిన పడి ఏడుగురు వ్యాపారులు మృతి చెందారు.. దీంతో ఇక్కడి వ్యాపార వర్గాల వారు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా కావలిలో రేపటి నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్ విధించనున్నారని పేర్కొన్నారు.. ఊహించని స్దాయిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు.
ఇక కరోనా విషయంలో ఏపీ సీయం జగన్ ఏన్నో చర్యలు తీసుకుంటున్నారు.. కరోనా రోగుల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలు ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయినా కరోనా కట్టడిలో ఏపీ కాస్త వెనబడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందంటున్నారు. వైద్య అధికారులు చెబుతున్న సూచనలను పాటించని జనం ఎక్కడున్నా ఈ కరోనా ఆగదు. ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటించాలనే బాధ్య ఉండాలి కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపట్ల ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని అనుకుంటున్నారట మరికొందరు జగన్ అభిమానులు..