ఇది ధన దాహమా.. అయితే... ఎప్పటికీ ఆగునో ఈ దప్పిక.. ఇది అధికార మోహమా.. అయితే... ఎప్పటికి తీరునో ఆ కోరిక.. మదమెక్కిన ఏనుగులా ప్రపంచం మీద పడుతున్నారు.. దీని వల్ల ప్రకృతి వినాశనం జరుగుతుంది.. మానవాళి అంతానికి ఎంతో దూరం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.. ఇదంతా చైనా అనే ఒక నికృష్టపు రాజ్యం వేస్తున్న తప్పడడుగుల వల్ల జరుగుతున్న అరాచకం.. మానవ వినాశనానికి మానవులే కారణం అంటారు.. నిజమే చైనా మానవులే కారణం అయ్యేలా కనిపిస్తుందట.. ఎందుకంటే  ఒక వైరెస్ ద్వార ప్రపంచ వినాశనము జరుగుతుందని ఎవరు ఊహించలేక పోయారు.. ఊహించనిది చేయడమే డ్రాగన్ స్పెషాలిటీ. అందుకే ఇప్పుడు ప్రపంచంలోకెల్లా పెద్ద రోగ్ దేశంగా పిలవబడుతుంది..

ప్రపంచంలో నంబర్ వన్ దేశం కావాలనే తన స్వప్నం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఏ వైరస్ అయినా ప్రయోగించి నాశనం చేస్తుంది. దీని చీకటి భాగోతం చూస్తే చుట్టుపక్కల 14 దేశాలతో సరిహద్దు గొడవలు, ఆర్థిక యుద్దాలు, ఆక్రమణలు, విలీనాలు, అణిచివేతలు. చైనా వేసే ఎత్తులో పాకిస్థాన్ ఉత్త ఆకురౌడీ బ్యాచ్. అసలు డాన్ ఎవరూ అంటే చైనాయే.. ఇలా వక్రీకరిస్తున్న బుద్ధిని సక్రమ మార్గంలో పెట్టుకునే తెలివి లేక తనకు పడని దేశాలపై ఇంకో రకం బయోవార్ స్టార్ట్ చేస్తోందట. ఈసారి ఆయా దేశాల వ్యవసాయాన్ని, పశుసంపదను ధ్వంసం చేసి, ఆర్థికంగా డిస్టర్బ్ చేసే కుట్రకు పురుడు పోసిందట. ఇందుకు గాను మొదట అమెరికాను ఎంచుకుంది.

దీని కుట్రలో భాగంగా అక్కడ ఉన్న ఏవో అడ్రెసులకు విత్తన ప్యాకెట్లు పంపిస్తోంది. ఆ విత్తనాల ద్వారా పంటలకు, మొక్కలకు, పశువులకు, చివరకు మనుషులకూ నష్టం వాటిల్లజేసే విషవైరసులను లేదా విషసంబంధ జాతుల్ని చైనా పంపిస్తోందనే అనుమానం బలంగా నాటుకుంది. ఎందుకంటే ఎవరూ ఆర్డర్లు ఇవ్వకపోయినా ఇలా పోటెత్తి ప్యాకెట్లు వస్తుంటే దాని అర్ధం ఏంటి ఏదో కుట్ర జరుగుతున్నదనే కదా.. ఈ విషయంలో ఆల్ రెడీ అమెరికాలోని అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేశారట అక్కడి అధికారులు. ఇక ఆ విత్తనాలు విత్తితే అవి రకరకాల దుష్ఫ్రభావాల్ని వ్యాప్తి చేసి, అంతిమంగా దేశ వాతావరణాన్ని, వ్యవసాయ సుస్థిరతను పొల్యూట్ చేస్తుందని భయం. నేడు అమెరికాలో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. మరి డ్రాగన్ కంట్లో ఉన్న దేశాలకు కూడా ముందు ముందు ఇదే పరిస్దితి ఎదురు కావచ్చు.


ఈ పరిస్దితుల్లో చైనాకు ప్రత్యర్థులుగా భావించే దేశాలు.. అమెరికా, జపాన్, ఇండియా, కొరియా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదటి లిస్టులో ఉంటాయి.. మన ఇండియాతో పోల్చుకుంటే మిగతా దేశాల్లో కాస్త చట్టాలు గట్రా కఠినంగా ఉంటాయ్.. అమెరికాలో అయితే నిఘా ఎక్కువ, ప్రభుత్వం చెప్పింది ప్రజలు తూచ తప్పకుండా భయంతోనో, భక్తితోనో పాటిస్తారు. కానీ మన ఇండియాలో.. మనకు మన దేశభద్రత కన్నా, ఇతర దేశాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఎవరైనా ఇది ప్రమాదంరా ఆ పని చేయకండిరా అంటే నువ్వేందిరా నాకు చెప్పేది. ఈ పని చేస్తే నాకు లాభం ఉంది. నేను బాగుపడుతున్నానంటే పక్క వాడ్ని చంపినా నాకు బాధలేదు అని కక్ష కట్టినట్టు మాట్లాడుతారు. ఇలాంటి మనుషులున్న మనదేశంలోకి అవే విత్తనాలు వస్తే ఎలా.. ఫ్రీగా వచ్చాయి కదా అని మన రైతులు మూహుర్తం కూడా చూడకుండా వారి పొలాల్లో పాతేస్తారు.


ఇంకా చెప్పాలంటే ఇవి బీటీ-4 జనరేషన్ పత్తి విత్తనాలు అని చెప్పండి చాలు, మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద సీడ్ కంపెనీలే అర్జెంటుగా తెప్పించుకుంటాయ్.. అసలే మనకు స్వేచ్ఛ ఎక్కువ, అరాచకం ఎక్కువ ఒకవేళ చైనా సీరియస్‌గా ఈ దాడికి దిగితే మాత్రం భారీ నష్టం తప్పదు. అందుకే ఇతర దేశాలకన్నా మనమే ఎక్కువ నష్టపోతాం. పైగా కేంద్రం చెబితే మేం వినాలా అన్నట్టుగా వ్యవహరించే కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరీ ప్రమాదం. ఇది మన దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం, తేలికగా తీసుకోవద్దని కేంద్రం గట్టిగా చెబుతోంది.. ఇక ఈ విషయంలో మన కేంద్ర వ్యవసాయ శాఖకు, ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఏదో ఉప్పు అందింది కావచ్చూ అందుకే ఈ అలర్ట్ ఆర్డర్ అన్ని రాష్ట్రాలకూ అర్జెంటుగా సర్క్యులేట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: