మోసం, దగా, కరోనా పేరు చెప్పుకుని సంవత్సరాలకు సరిపడా ధనాన్ని సంపాదించుకుంటున్నారట. చచ్చిన పీనుగుల కోసం రాబందులు ఎగబడినట్లుగా కరోనా రోగులు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లితే, రాక్షసులకంటే కౄరంగా పీక్కు తింటున్నారట. ఇలాంటి సంఘటనలు ఎన్ని పెద్దల దృష్టికి వెళ్ళినా విచారణ చేపడుతున్నాం, మోసగాళ్లను గుర్తిస్తున్నాం అని కల్లబొల్లి కబుర్లే వినిపిస్తున్నాయి గానీ, పేదల గోడు పట్టించుకునే వారే లేరట. ఓటుకు వేయి, రెండువేలు తీసుకుని నాయకుల్ని ఎన్నుకునే దరిద్రులు, పుండాకోరులు ఉన్నంత కాలం ఈ బ్రతుకులు మారవని న్యాయాన్ని రక్షించుకుంటున్న కొందరు ఆవేదన వెళ్లగక్కుతున్నారట.


కరోనా వచ్చినా గానీ మళ్లీ ఓట్ల సమయంలో నోట్లకు అమ్ముడు పోయే కంటే, వ్యభిచారం చేయించి సంపాదించుకుంటే మంచిదని కరోనా దోపిడికి గురవుతున్న పేదలు ఆవేశంతో ఆక్రోశంగా మాట్లాడుతున్నారట. నిజమే అసలు రాష్ట్రానికే పెద్ద దిక్కులేని అనాధగా మారుతున్న నేపధ్యంలో ప్రజల గురించి పట్టించుకునే వారు ఎవరు. ఇకపోతే కరోనా దోపిడిలో జరుగుతున్న ఒక పార్ట్‌ను గమనిస్తే. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులు చేయించుకొనే సీటీ స్కాన్‌లలో ఎటువంటి వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినా మార్ఫింగ్‌ చేయడం మొదలు పెట్టాయట.


సీటీ స్కాన్‌ తీశాక రిపోర్ట్‌ కాపీని మార్చడమే కాకుండా సీటీ స్కాన్‌ ఫిల్మ్‌ను కూడా మార్ఫింగ్‌ చేస్తున్నాయట. ముందుగా అస్పత్రికి వచ్చిన వారికి భయం కలిగేలా ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేకపోయినా, ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగి ఫిల్మ్‌లో, ఇన్ఫెక్షన్ లేని అతని పేరు ఉండేలా చేసి, పాత ఫిల్మ్‌లలోని తేదీలను కూడా మార్ఫింగ్‌ చేస్తున్నట్లు తేలిందని ఒక వైద్యాధికారి తెలుపగా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు చెప్పి.. బాధితులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకొని.. రూ. లక్షలు గుంజుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు మరో వైద్యాధికారి తెలిపారు.


తాజాగా ఒక కలెక్టర్‌ కుటుంబాన్నే మోసం చేశారంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి ఎందాక వచ్చిందో అర్థం చేసుకోండి. ఇకనైనా సిగ్గు శరం అనేవి ఉంటే ఎలక్షన్లలో బిస్కిట్లకు కుక్కలు ఆశపడ్దట్లు, నోట్లకు అమ్ముడుపోయే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి అవినీతికి దూరంగా, న్యాయంగా పాలించే వారిని ఎన్నుకుంటారని కోరుకుందాం..



మరింత సమాచారం తెలుసుకోండి: