కరోనా లోకానికి యమ గండంగా మారుతుంది.. దీని బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో అయితే ఎమర్జెన్సీ చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. ఇక తెలిసో తెలియకో.. బంధువుల పై ఉన్న ప్రేమతో, స్నేహితుల మధ్య ఉన్న సాన్నిత్యంతో దీని బారినపడే వారు ఎక్కువ అవుతున్నారు.. ఇదీగాక ఆత్మ స్థైర్యం, వైద్యుల చికిత్సతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనాను కోటికి మందికి పైగా జయించారు.


ఈ నేపధ్యంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది.. అదేమంటే కరోనా నుంచి కోలుకున్న వారికి పలు సైడ్ ఎఫెక్ట్‌లు తప్పవని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు తెలుపుచుండగా తాజాగా చేసిన ఓ పరిశోధనలో కరోనా నుంచి కోలుకున్న వారి మెదడుకు తీవ్ర ముప్పు ఉంటుందని తేలిందట. ఈ వైరస్ నుండి కోలుకున్న వారిలోని మెదడులను మూడు నెలలుగా ఎమ్మారై స్కానింగ్ తీయగా, ఈ విషయం బయటపడిందని ఆ పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొంటున్నారు.


కరోనా నుంచి కోలుకుంటున్న 55శాతం మందిలో నాడీ సంబంధ సమస్యలను కనుగొన్నారని మెడికల్ జర్నల్‌ ద లాన్సెట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. అలాగే వారు కోలుకున్నాక వరుసగా మూడు నెలల పాటు ఎమ్మారై స్కానింగ్ చేయగా అందులో ఈ లక్షణాలు కనిపించాయట. ఇక కరోనా లక్షణాలలో వాసన కోల్పోవడం, ఙ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి మార్పులు జరుగుతున్నాయని ఈ పరిశోధనలో కూడా తేలిందట.


ఒకవేళ ఈ కరోనా వైరస్ను పూర్తిగా జయించినప్పటికీ, నాడీ సంబంధ సమస్యలు మాత్రం వారిని ఇబ్బంది పెట్టొచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కాగా  11 మంది చైనా పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారట.. ఇది వరకు చేసిన పరిశోధనలో ఈ వైరస్ గురించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి.. ఇంకా తెలుసుకోవడానికి ఈ వైరస్ పై మరింత లోతైన అధ్యయనం చేయవలసి ఉందని ఈ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఎవరు ఎన్ని పరిశోధనలు చేసిన ఈ రోగానికి త్వరగా మందు వస్తే బాగుండు అని దేవున్ని వేడుకోని వారు ఉండరు..


మరింత సమాచారం తెలుసుకోండి: