దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతం గా పెరిగి పోతుంది. కొన్ని రాష్ట్రా లలో అయితే మరింత దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కేసులను కంట్రోల్ చేయడానికి ఎన్నో కఠిన ఆంక్షలు కూడా అమలు లోకి తెస్తుంది. అయితే రెండవ దశ కరోనా వైరస్ ప్రజల పై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే ఎంతో మంది ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తి చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి.



 ఇక ఎంతో మందిలో ఇలా ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతున్నా సమయం లో ఇక ఆసుపత్రిలో తప్పని సరిగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత అందరినీ వేధిస్తుంది. అయితే ఆక్సిజన్ కొరత నేపథ్యంలో అందరు అధికారులు ఇక ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో పారిశుద్ధ్య పనులను నిరంతరాయంగా చేపడుతున్నారు అధికారులు. ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్ మహేంద్రసింగ్ ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.




 ఆక్సిజన్ సిలిండర్ ల కోసం కూపన్ పద్ధతిని ప్రవేశ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్. ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించనున్నారు ఘాజియాబాద్ ప్రాంత వాసులు అందరూ కూడా ఈ కూపన్ ద్వారా ఆక్సీజన్ సిలిండర్లు ఇచ్చి అందుకు బదులుగా ఆక్సిజన్ సిలిండర్లు పొందెందుకు అవకాశం ఉంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆక్సిజన్ సిలిండర్ కూపన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన బాధితులందరికీ కూడా ఆక్సిజన్ అందించడమే తమ లక్ష్యం అంటూ అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: