ఒకపుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం రామనారాయణరెడ్డి పరిస్దితి ఇపుడు దయనీయంగా తయారైంది. కాలచక్ర మహిమను ఆనం అంగీకరించలేకపోతున్నారు. తాను ఉన్నంత కాలం జిల్లా రాజకీయాలను తానే శాసించాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే తనకు కోరిక ఉన్నంతమాత్రానా అయిపోదని కాస్త కాలం కూడా కలిసిరావాలన్న సత్యాన్ని మరచిపోయారు.





అందుకనే మొన్నటి టీడీపీ ప్రభుత్వంలోను ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలోను నిత్య అసంతృప్తిగా మిగిలిపోయారు. తాను కోరుకున్న పదవులు, ప్రాధాన్యత దక్కకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో జిల్లాలో మళ్ళీ చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. అందుకనే తన కుటుంబం నుండే ముగ్గరిని పోటీలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో ఆనం గెలుస్తారా లేదా అన్న విషయమే అనుమానం. అలాంటిది కుటుంబంలోనే మరో ఇద్దరితో కూడా పోటీ చేయించాలని ప్లాన్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఆనం ఫ్యామిలి ఏ పార్టీలో ఉన్నా ఇదే తంతు. తాము చెప్పింది జరగకపోతే, తమకు ప్రాధాన్యత దక్కకపోతే ఇక అసంతృప్తి మొదలైపోతుంది. 




ప్రస్తుతం వైసీపీ తరపున వెంకటగిరి ఎంఎల్ఏగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ దక్కేది అనుమానమే. నిజానికి ఆనం కుటుంబానికి వెంకటగిరి, ఉదయగిరి, నెల్లూరు, ఆత్మకూరులో మంచి పట్టుంది. అయితే అదంతా చరిత్ర. కాలం గడిచేకొద్దీ కొత్త తరాలు నాయకత్వంలోకి వస్తున్నాయన్న విషయాన్ని ఆనం గ్రహించటంలేదు. కాలం ఎంతకాలమైనా తనదే ఆధిపత్యం ఉండాలని కోరుకోవటం దగ్గరే సమస్య వస్తోంది.





జిల్లా రాజకీయాల్లో తనకు పూర్వ వైభవం రావాలంటే తన కుటుంబంలో నుండే పై నియోజకవర్గాల్లో పోటీలోకి దిగాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. తాను, తన వారసులతో పాటు సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కొడుకు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారట. మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారు కానీ ఏ పార్టీ అన్నదే సస్పెన్సుగా మారిపోయింది. బహుశా బీజేపీ, జనసేన పార్టీల తరపున పోటీ చేస్తారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: