మెట్రో ఇప్పుడు సరికొత్త కార్డును అందిస్తుంది..ఇది షాపింగ్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్..ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ కొత్త క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ కార్డులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డు పేరు మెట్రో కోటక్ క్రెడిట్ కార్డు. ఇది కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ద్వారా 48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ ఫెసిలిటీ పొందొచ్చు.


మెట్రో ఇండియా రిజిస్టర్డ్ కస్టమర్లు ఈ ఫెసిలిటీ సొంతం చేసుకోవచ్చు. రూపే నెట్‌వర్క్‌పై ఈ కార్డు పని చేస్తుంది. మెట్రో స్టోర్స్‌లో ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించొచ్చు. ఈ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 25 వేల నుంచి ప్రారంభం అవుతోంది.. ఈ క్రెడిట్ కార్డును వాడటం ద్వారా నెలకు రూ.10 వేలు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. అయితే మెట్రోలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చు ప్రాతిపదికన వచ్చే క్యాష్ బ్యాక్ కూడా ఆధారపడి ఉంటుంది. కోటక్ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా లేని మెట్రో బిజినెస్ కస్టమర్లు కూడా ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.


స్మాల్ ట్రేడర్లు, కిరాణా స్టోర్ ఓనర్లు, ఎంఎస్ఎంఈల కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు బిజినెస్ హెడ్ ఫెడెరిక్ డిసౌజా తెలిపారు..ఈ క్రెడిట్ కార్డు ద్వారా 49 రోజుల వరకు క్రెడిట్ ఫ్రీ ఫెసిలిటీ పొందొచ్చని తెలిపారు.కాగా ఈ క్రెడిట్ కార్డు మెట్రో నుంచి పెద్ద మొత్తంలో తమ రిటైల్ స్టోర్లకు సరుకులు కొనే వారికి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో సులభంగానే ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు. నో జాయినింగ్ ఫీజు. అలాగే ఇయర్లీ ఫీజు కూడా ఉండదని ఉచితంగానే కార్డును పొందవచ్చనని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: