రాజధాని ప్రాంతం అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని పిటీషన్ వేసిన రైతులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళస్ధలాలు ఇవ్వకూడదంటే ఎలాగ అంటు నిలదీసింది. పేదలు రాష్ట్రంలో భాగం కాదా ? పేదలకు ఇళ్ళస్ధలాలు ఇవ్వటమంటే వాళ్ళని అభివృద్ధి చేయటం కాదా అంటు తీవ్రంగా ప్రశ్నించింది. ప్రతి అంశానికి కోర్టులో కేసులు వేయటం ప్రతి కేసును స్పెషల్ లీవ్ పిటీషన్ అని అత్యవసరమని చెప్పటం ఫ్యాషన్ అయిపోయిందంటు మడిపోయింది.





పేదలకు ఇళ్ళస్ధలాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం 1136 ఎకరాలు కేటాయించింది. భూమిని ప్లాట్లుగా విభజించి పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా 45 జీవోను రిలీజ్ చేసింది. ఈ జీవో అమలుకాకుండానే రైతుల తరపున కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ పై విచారణ సంరద్భంగానే కోర్టు పిటీషన్ దారులపై మండిపోయింది. అసలు భూములను సీఆర్డీఏకి ఇచ్చేసిన తర్వాత ఆ భూములన్నీ రైతులవి ఎలాగ అవుతాయని నిలదీసింది.





భూములను ఒకసారి సీఆర్డీఏకి ఇచ్చేసిన తర్వాత అవి సీఆర్డీఏ సొంతమవుతాయే కానీ రైతులవి కావని స్పష్టంగా చెప్పేసింది. సీఆర్డీఏ భూములను ప్రభుత్వం పేదలకు పట్టాలుగా ఇవ్వాలని అనుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటు పిటీషన్లు వేసిన వారిని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై  ఏదో ఒక కారణంతో కోర్టుల్లో పిటీషన్లు వేయటం ఏమిటని ప్రశ్నించింది.






ప్రభుత్వానికి వ్యతిరేకంగా  కొన్ని పిటీషన్లను హైకోర్టులోను మరికొన్ని కేసులను సుప్రింకోర్టులోను వ్యూహాత్మకంగా వేస్తున్నట్లు అభిప్రాయపడింది. ఇపుడు కూడా స్పెషల్ లీవ్ పిటీషన్ పేరుతో పిటీషన్ వేసి తమపై ఒత్తిడితెచ్చి అనుకూలంగా ఉత్తర్వులు జారీచేయించుకుందామని అనుకుంటున్నారా అంటు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 45పై స్టే ఇవ్వటం సాధ్యంకాదని తేల్చేసింది. అవసరమని అనుకుంటే సుప్రింకోర్టులో పిటీషన్ వేసుకోమని చెప్పేసింది. జరగని కేటాయింపులపై కేసులు వేయటం ఏమిటని అడిగింది. సుప్రింకోర్టులో కేసుంది కాబట్టి హైకోర్టు తొంరదపడటంలేదని చెప్పేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: