
నిన్నటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు ఛేజింగ్ జట్లు గెలిచాయి. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అందుకో ఈ మ్యాచ్ లో కూడా మొదట టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపుతుంది. అయితే ఏ జట్టు టాస్ గెలుస్తుందో అన్నది తెలియాల్సి ఉంది.
కాగా ఇరు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు ఎవరని చెప్పుకుంటే, చెన్నై లో జడేజా, ధోని, మొయిన్ అలీ మరియు బ్రేవో లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం నల్లేరు పై నడకే. కానీ జడేజా కెప్టెన్ అయిన తర్వాత దూకుడు తగ్గించాడని తెలుస్తోంది. ఎందుకంటే గత మ్యాచ్ లో ఒక వైపు ఎప్పుడూ స్లో గా ఆడే ధోని తన బ్యాట్ ను జులిపిస్తుంటే జడేజా మాత్రం నెమ్మదిగా ఆడడం ఆశ్చర్యంగా అనిపించింది. మరి ఈ మ్యాచ్ లో అయిన తన మెరుపులు ఉంటాయా చూడాలి.
ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే, వీరికి తమ కెప్టెన్ రాహుల్ బలం మరియు బలహీనత. కాబట్టి ఈ మ్యాచ్ లో పూర్తిగా తన ఆలోచనా విధానం, ఆడే తీరు అంతా మార్చుకుని ఒక్క ప్రయత్నం చేస్తే జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు అయిన డి కాక్, లూయిస్, రాహుల్ మరియు మనీష్ పాండే లు రాణించాల్సి ఉంది.
మరి ఈ మ్యాచ్ లో ఎవరు సరైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో ఖాతాను తెరుస్తారో చూడాలి.
టీడీపీ నేత అజీజ్: జగన్.. "మేక తోలు కప్పుకున్న పులి"
ఏపీలో