ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఐపీఎల్ కు నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో తెర పడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరిగిన కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అటు జూన్ 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలబడబోతున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఈ మెగా ఫైనల్ గురించి అటు రివ్యూలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయ్. ఎంతో మంది మాజీ ప్లేయర్స్ ఈ విషయంపై స్పందిస్తూ డబ్ల్యూటీసి ఫైనల్ లో విజేతగా నిలిచిన టీం ఏది అనే విషయంపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జట్టులో ఏ ప్లేయర్స్ ఉంటే బాగుంటుంది అనే దానిపై కూడా రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. డబ్ల్యూటిసి ఫైనల్ లో ఆస్ట్రేలియా తుది జట్టును అంచనా వేసాడు. అయితే మైఖేల్ నాజర్ ని తీసుకునేందుకు మొగ్గు చూపడంపై రికీ పాంటింగ్ హర్షం వ్యక్తం చేశాడు.


 భారత్తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ లో అదనంగా మరో ఫేసర్ జట్టులో ఉంటే నిర్ణయాత్మకం అవుతాడని పేర్కొన్నాడు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. నాసెర్ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇక ఇంగ్లీష్ పిచ్ పరిస్థితులపై అతను ఒక భయంకరమైన బౌలర్. కౌంటి క్రికెట్లో అతడు బౌలింగ్ చూసాం. సరిగ్గా ఓవల్ పిచ్ కు సరిపోతాడు. వికెట్లను తీయడంతో పాటు బ్యాటింగ్ చేయడం అదనంగా కలిసి వచ్చే అంశం. గత కౌంటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. అన్ని నైపుణ్యాలు ఉన్న ఆటగాడు నాసేర్. స్కాట్ బుల్యాండ్ కూడా ప్రభావం చూపిస్తాడు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: