దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులందరికీ  అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది. ఇక 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా ఛాంపియన్ టీం చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ అయితే ముగిసింది కానీ ఇక ఐపీఎల్ లో ఎంతోమంది ప్లేయర్స్ సాధించిన రికార్డుల గురించిన చర్చ మాత్రం ఇంకా ముగియడం లేదు. ఐపీఎల్ లో బాగా రాణించిన ఆటగాళ్లపై ఎంతో మంది మాజీలు ఇంకా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజు గైక్వాడ్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ కనబరిచిన రుతురాజ్ గైక్వాడ్ ఇక 2023 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టాడు. ప్రతి మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేసి ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అంతేకాదు టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు అని చెప్పాలి. చెన్నై మరో ఓపెనర్ డేవన్ కాన్వే తో కలిసి రుతురాజు గైక్వాడ్  విధ్వంసం సృష్టిస్తూ ఒక రకంగా బౌలర్లను భయపెట్టాడు. అయితే ఇక రుతురాజు గైక్వాడ్ ప్రదర్శన గురించి టీమ్ పాక్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ స్పందించాడు. ఏకంగా అతని బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రుతురాజు గైక్వాడ్  భవిష్యత్తులో టీమిండియా ప్రధాన ఆటగాడిగా  మారుతాడు అనడంలో సందేహం లేదు. తీవ్ర ఒత్తిడిలో కూడా గైక్వాడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్లో సూపర్ క్యాచ్లు పట్టాడు. రానున్న రోజుల్లో ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే కాదు.. భారత క్రికెట్లో కూడా అతడు ఎంతో కీలకంగా మారబోతున్నాడు అంటూ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. కాగా రుతురాజు గైక్వాడ్  ఐపీఎల్ 16 సీజన్లో 16 మ్యాచ్ లలో కలిపి 590 రన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: