ఇక ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ రోజుల్లో ప్రతిదీ కూడా మన చేతి వద్దకు వచ్చేస్తోంది.చాట్ జీపీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది చాలా బాగా ఫేమస్ అయ్యింది.ఈ జనరేషన్ లో చాలా మంది కూడా చాట్‌జీపీటీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే వంద కొట్ల మంది వినియోగదారులతో ప్రపంచాన్ని చుట్టిసిన చాట్ జీపీటీ..ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందిన ఎన్నో పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు పోటీగా నిలబడింది. అయితే ఈ చాట్ జీపీటీ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఇలా చాట్ జీపీటీని వినియోగిస్తున్నందున భారీ ముల్యం చెల్లించాల్సి వస్తోందని వారు తెలిపారు.


యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంకా రివర్‌సైడ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్‌టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి దాదాపు 500 మిల్లీ లీటర్ల నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది.అయితే ఈ చాట్‌జీపీటీకి ఇంకా అలాగే నీటి మధ్య సంబంధం ఏమిటంటే..ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మోడల్‌లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్‌లను చల్లబరచేందుకు చాలా ఎక్కువగా నీటిని ఉపయోగిస్తారని తెలిపారు. వాటి డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి మరీ శాస్త్రవేత్తలు ఈ అంచనాకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సర్వర్లు నడవాలంటే కూడా ఎక్కువగా మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. అయితే జీపీటీ-3కి శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ మొత్తం 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించిదని పేర్కొన్నారు. ఇంకా ఇదే కాకుండా ఇతర కంపెనీలు ఏఐ మాడళ్లు నిర్వహణకు భారీగా నీటిని వినియోగిస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: