
అయితే ఇప్పటివరకు అటు మనుషులు మాత్రమే ఇలా ఏదైనా మనసులో పెట్టుకుని రివేంజ్ తీర్చుకోవడం గురించి విన్నాం. కానీ కుక్కలు కూడా రివేంజ్ తీర్చుకుంటాయి అన్నది మాత్రం ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఏకంగా ఒక కుక్క తనను కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన యజమానిపై రివెంజ్ తీర్చుకోవడానికి చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కొంతమంది కుక్క చేసిన పని చూసి నవ్వుకుంటుంటే మరి కొంతమంది కుక్కలు ఇలా కూడా రివెంజ్ తీర్చుకుంటాయా అని కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి ఉంచారు. చూడ్డానికి అది పార్కింగ్ ఏరియా లాగా కనిపిస్తుంది. ఇలా తనను స్కూటీకి కట్టేసి వెళ్లిన యజమాని ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆ కుక్కకు తిక్క రేగింది. ఇంకేముంది ఈ యజమానిపై ఏదో ఒక విధంగా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంది. విశ్వాసం ఉంటుంది కాబట్టి యజమానిని ఏమి చేయలేదు. అందుకే యజమాని స్కూటీపై తన రివేంజ్ తీర్చుకుంది. ఏకంగా కాలి గోర్లతో చించేయడం ప్రారంభించింది. ఇక అదే పార్కింగ్ ఏరియాలో ఉన్న ఒక వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.