మొన్నటి వరకు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుత పులులు వచ్చి ఏకంగా గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే అటవీ శాఖ  అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇక ఆయా గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు చిరుతపులల బెడద అయితే కాస్త తగినట్లే కనిపిస్తుంది. కానీ అంతలోనే గ్రామ సింహాలు మాత్రం మరింత రెచ్చిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని భయాందోళన గురిచేస్తుంది అని చెప్పాలి.


 కంటికి ఎవరు కనిపించినా వారిపై దాడుకి పాల్పడుతూ దారుణంగా గాయాలు చేస్తూ ఉన్నాయి కుక్కలు. అయితే అధికారులు ఇక కుక్కల నుంచి అటు జనాలకు రక్షణ కల్పించేందుకు ఎంతల చర్యలు చేపట్టిన ఇక వీధి కుక్కలు మాత్రం స్వైర విహారం చేస్తూ మరింత రెచ్చిపోతున్నాయి. మొన్నటికి మొన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం నజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 12 లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి చెంపపై దారుణంగా గాయం చేసింది. ఇక మందమర్రి పట్టణంలో రామన్ కాలనీలో శునకాల దాడిలో 13 ఏళ్ల విశ్వకు గాయాలయ్యాయి. ఇక మరోవైపు మండల కేంద్రంలోని గజ నందు నగర్, మర్కాగూడలో కూడా కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి.


 జనవరిలో 34 మంది, ఫిబ్రవరిలో 14 మంది కుక్కర్లో దాడిలో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇక అదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి. ఆదర్శనగర్ కాలనీలో ఒక పిచ్చి కుక్క దాడి చేసి ఏడుపురిని గాయపరిచింది. వారంతా మహిళలు కావడం గమనార్హం. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకి పోతున్నారు. తప్పనిసరిగా చేతిలో ఒక కర్ర పట్టుకుని బయటకు వెళ్తున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా పిల్లలను ఆడుకోవడానికి బయటకి పంపాలంటే మరింత ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు చిరుతపులులతో భయాందోళన ఉంటే.. ఇక ఇప్పుడు కుక్కలతో భయం ఉంది ఇలా అయితే ఎలా బతికేది అని ఆందోళన చెందుతున్నారు కొమరం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: