జగన్ కి ఇప్పుడు అతి పెద్ద పరీక్ష వచ్చింది. నా ఎస్సీ, నా ఎస్టి, నా బీసీ, నా మైనారిటీ అంటారు కదా. ఇప్పుడు అతి పెద్ద పరీక్ష వచ్చింది. వాకపల్లి బాధితులకు పరిహారం ఇవ్వమని చెప్పింది కోర్టు. అయితే పోలీసులు నిర్దోషులు అంది, అలా అయితే పరిహారం ఇవ్వడానికి లేదు. పరిహారం ఇవ్వండి కానీ పోలీసులు నిర్దోషులు‌. ఎందుకయ్యా అంటే సరిగ్గా నిరూపించడంలో సంబంధిత అధికారులు ఫెయిల్ అయ్యారు అంటుంది.


లెక్క ప్రకారం అయితే పై కోర్టుకు అప్పీలు కి వెళ్ళాలి. అలా వెళ్తే వీళ్ళు ఎవరికీ డబ్బులు రావు. ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో నక్సలైట్లును పోలీసులు తరుముతుంటే, వెళ్లి వాళ్ళ ఇళ్ళల్లో దాక్కుంటే కాపలా కాసి, అండగా నిలబడి  గ్రేహౌండ్స్ ఇంకా పోలీసుల మీద దాడులు చేశారు. కళ్ళలో కారం కొట్టి వెంటపడి తరిమారు. ఆ తర్వాత పూర్తి స్థాయి సిబ్బందిని వెంటపడి తీసుకొచ్చారని తెలిసి మగాళ్లు అందరూ ఊరు నుండి పారిపోయారు.


అడవుల్లో దాక్కుని మహిళలను ముందు పెట్టారు పక్కా ప్రణాళికతో. వాళ్లను ఆ ఇళ్లల్లో తనిఖీలు చేస్తే మా ఇంట్లో అడుగు పెట్టడం ఖచ్చితంగా నేరం. మా మహిళలను చేతులు పట్టుకుని లాగారు. కాబట్టి అది అత్యాచారం, గిరిజన సాంప్రదాయం ప్రకారం మహిళలను చేయిపట్టి లాగి తీసుకెళ్లి, తుపాకులు చూపించి బావి దగ్గర కూర్చోబెట్టడం ఇవన్నీ ఆ కేస్ కిందే వస్తాయని అక్కడ పగిలిన గాజు పెంకులు అవి చూపించారు.


అయితే  వాళ్ళందరినీ రానివ్వకుండా చేయడానికి అక్కడ కూర్చోబెట్టాం, ఆ టైంలో వాళ్లు దాడి చేయబోతుంటే జరిగినటువంటి  పెనుగులాట వల్ల ఈ గాజు పెంకుల ధ్వంసం అని చెప్పారు. అయితే ఆ పెనుగులాట అక్కడ అసలు మహిళా పోలీసులు లేరు కాబట్టి అని, వాళ్ళ కుల సంప్రదాయం ప్రకారం అది అత్యాచారం కింద పరిగణించాలని మెన్షన్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: