
కానీ అనుమానితులను అదుపులోకి తీసుకున్న సమయంలో అనుమానాలు ఉంటే కాస్త ఆ ప్రదేశంలో లేదా ఆ రాష్ట్రం, ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి ముప్పు నుంచి తప్పించవచ్చు. మూడో ది కచ్చితమైన సమాచారం. ఆయా తీవ్రవాదులు సరిహద్దులు దాటారు. పక్కా ప్లాన్ తో దాడులు జరిగే అవకాశం ఉంది అని ఇన్పర్మేషన్ వచ్చినపుడు అలర్ట్ ఉండి ఆ దాడి జరగకుండా అనుమానితులను అరెస్టు చేసి సమాచారాన్ని రాబడుతారు. తద్వారా ఆ దాడినే కాదు దాని తర్వాత చేయబోయే కార్యకలాపాలను కూడా నిలువరించగలుగుతారు.
ఇలా అనేక రకాల ఇన్మర్పేషన్ ఇస్తుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. పాక్ లో మొత్తం అల్లకల్లోలం జరిగిపోతుంది. అక్కడ హత్యలు జరుగుతున్నాయి. లూటీలు జరుగుతున్నాయి. పలు పట్టణాల్లో విధ్వంస కాండ జరుగుతోంది. ఈ దాడుల వల్ల అక్కడ ఉండలేని చాలా మంది వలస వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కు కూడా చాలా మంది అక్కడి విద్యావంతులు, ఇబ్బందులు పడుతున్న వారు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి భారత సైన్యం అలర్ట్ గా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి. వలసవాదుల ముసుగులో ఇండియాకు పాక్ లోని తీవ్రవాదులు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఇచ్చింది. దీంతో ఇండియా సరిహద్దుల వద్ద కఠిన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇండియా, పాక్ సరిహద్దుల్లో నుంచి ఎవరూ కూడా వలస వాదులు రాకుండా చర్యలు చేపట్టారు.