ఈమధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్ వార్తలు రాజకీయాలలో బాగా చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఈపదాన్ని ఒకనాటి గ్లామర్ బ్యూటీ సమీరా రెడ్డి తనను విమర్శించిన విమర్శకుల పై ప్రయోగించడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

సినిమాలను వదిలి సమీరా రెడ్డి బిజినెస్ మేన్ అక్షయ్ వార్దేని పెళ్లి చేసుకున్న తరువాత కూడ సమీరా రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఒక బిడ్డకు తల్లిగా మారిన ఈమె త్వరలో మరో బిడ్డను కనబోతోంది. ఈమధ్య కాలంలో ‘బేబి బంప్’
 ఫోటోలను షేర్ చేయడం కొందరికి చాల హాబీగా మారింది. 

ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తరువాత హీరోయిన్స్ తాము తల్లికాబోతున్న విషయాలను తమ అభిమానులకు షేర్ చేస్తూ ఈ బేబి బంప్ ఫోటోలను షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. ఈ పద్ధతిని కొనసాగిస్తూ సమీరా రెడ్డి కూడ నెలలు నిండిన తన బేబీ బంప్ ఫోటోను ఈమధ్య షేర్ చేసింది. అయితే దీని పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. నెలలు నిండిన తల్లి చేయవలసిన పని ఇదేనా అంటూ కొందరు సమీరా రెడ్డి పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. 

ఇప్పుడు ఆ కామెంట్స్ కు సమీరా రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ మరొక ఫోటోను షేర్ చేయడమే కాకుండా ఒక షాకింగ్ కామెంట్ కూడ చేసింది. ‘పుట్టేందుకు సిద్ధంగా ఉన్న నా బిడ్డ ఆత్మ ఎంతో బాధపడింది. నా కడుపులో స్విమ్ చేస్తున్న బిడ్డ ఆత్మను గాయపరిచారు. లావుగా ఉన్నానని ఎవరైతే నన్ను తిట్టేందుకు ఉబలాట పడ్డారో వాళ్లందరికీ ఇదే నా సమాధానం’ అని ఎమోషన్ తో కూడుకున్న కొటేషన్ ని పెట్టి సమీరారెడ్డి మరో లేటెస్ట్ ఫోటోను షేర్ చేసింది. దీనితో షాక్ అవ్వడం తప్ప మరొక మార్గం లేక నెటిజన్లు సైలెంట్ అయిపోయారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: