
ఎప్పుడు పెదాలపై ఆ నవ్వును పూయిస్తూనే ఉండే సుమ యాంకరింగ్ అంటే ఇష్టపడని వారు ఉంటారా.. అందుకే యాంకరింగ్‌లో ఎవరు లేనంత బిజీగా మారిన సుమ కనకాల బిజీ లైఫ్‌కు ఊహించని విధంగా కరోనా బ్రేక్ వేసింది. దీంతో వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అన్ని తెరలు క్లోజ్ చేశారు. దీనివల్ల యాంకర్లకు పని లేకుండా పోయింది. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ దూరమైంది. ఫలితంగా కొన్నాళ్ల పాటు సినిమా, టీవీ ఫంక్షన్లు కూడా లేకుండా పోయాయి. కానీ ప్రభుత్వ అనుమతితో ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ కావడంతో సుమ కనకాల ట్రాక్ లోకి వచ్చారు.
ఇందులో భాగంగా సుమ అందరితో “ఆహా” అనిపించడానికి రెడీగా ఉన్నారు. ఇకపోతే మన తెలుగు మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో సుమ ఓ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారట. ఇక “ఆల్ ఈజ్ వెల్ విత్ సుమ”. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన మంచికే అన్న టైప్ లో దూసుకెళ్లిపోవాలని చెప్తూ ప్లాన్ చేసిన ఈ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం తాలుకా ప్రీమియర్స్ “ఆహా” పోగ్రాం వచ్చే ఆగష్టు 15 నుంచి ప్రసారం కానుందట. అప్పుడే ఈ షో గురించి తెగ ఊహించుకోకండి. ఆరాటపడకండి అంటున్నారు ఈ షో నిర్వాహకులు. మరి ఈ షో ఎలా ఉండనుందో తెలియాలి అంటే మరో వారం ఆగవలసిందేనటా..