అప్పట్లో అవికాగొర్ ‘చిన్నారి పెళ్లికూతురు గా టీవీ సీరియల్ లో నటించింది కానీ, ఇప్పుడు చిన్నారి పెళ్లి కూతురు పెద్ద హీరోయిన్ అయిపొయింది.అవును అవికా గోర్ ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద సీరియల్స్ లోనూ కనిపిస్తున్నట్లు సమాచారం.అయితే, ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ మీదే అవికా దృష్టి పెట్టిందట . అందుకే ఆమె ‘బాలికా వధూ’ సీరియల్ సీజన్ 2 లో టైటిల్ రోల్ చేయటం లేదని సమాచారం.

చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ కి హిందీలో ఒరిజినల్ వర్షన్ ‘బాలికా వధూ’వచ్చింది. అందులో అప్పట్లో అవికా ఆనందిగా అలరించి మెప్పించింది . కానీ త్వరలో ‘బాలికా వధూ 2’సీరియల్ స్టార్ట్ అవుతుంది.మన  చిన్నారి పెళ్లికూతురు మాత్రం దక్షిణాది లో కొన్ని సినిమాలతో బిజీగా ఉందని సమాచారం.ఆమె బదులు ఆ సీరియల్ నిర్మాతలు ఈసారి సీరియల్ లో ‘ఆనంది’పాత్రకు శ్రేయా పటేల్ ని ఎంచుకున్నట్లు సమాచారం. అవికా గోర్ మాత్రం ‘బాలికా వధూ 2'సీజన్ లో మరోక పాత్రలో కనువిందు చేయనుందట. కొత్త సీజన్ తో సరికొత్త పాత్రలో కనిపిచంబోతోన్న అవికా గోర్ ఎంతో ఉత్సాహంగా ఉందట.ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకి ఆ సీరియల్ వస్తుందో అని ఎదురు చూస్తుందట.

ఇదిలా ఉండగా అవికా గోర్ మరియు నవీన్ చంద్ర ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేస్తుంటారు. వీరికి కథలు మరియు వాటిలోని పాత్రలు నచ్చితేనే ఆ సినిమాలకు ఓకే చెబుతుంటారు. ఈ మధ్య అయితే నవీన్ చంద్ర విలన్‌గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్‌లోనూ మంచిగా మెప్పిస్తున్నారు. ఇక అవికా గోర్ చాలా రోజులకు మళ్లీ తెలుగులో మెరిసేందుకు సిద్ధం అవుతున్నారట. చివరగా అవికా గోర్ రాజు గారి గది 3 సినిమాలో కనిపించి మెప్పించింది. ఇక నవీన్ చంద్ర అయితే అర్ద శతాబ్దం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి సందడి చేసాడు. తాజాగా వీరు ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించ బోతున్నట్లు సమాచారం .సహజంగానే వీరు ఇద్దరూ అంటే మంచి హీరో హీరోయిన్లుగా నటిస్తుంటారని అంతా ఊహించుకొని ఉండవచ్చు. కానీ వీరు ఇద్దరూ హీరో హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లెళ్లుగా నటించబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ మరియు ఫస్ట్ లుక్‌ బయటకు వచ్చింది. నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయించారు దర్శకనిర్మాతలు .రాఖీ పండుగ త్వరలోనే రానుంది కావున ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతోన్నామని చెప్పినట్లు సమాచారం. టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసినందుకు రష్మిక మందన్నాకు అవికా గోర్ కృతజ్ఞతలు చెప్పారు. కార్తీక్ తురుపాని దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాను రవిచంద్ నిర్మిస్తున్నట్లు సమాచారం . శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నట్లు వార్త వినిపిస్తుంది. మొత్తానికి ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా ఏవిధంగా మెప్పిస్తారో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: