తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణం మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ స్థితిగతులను మార్చి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాను పరిచయం చేసిన నిత్య శ్రామికుడు. దశాబ్దాలుగా చిత్రసీమలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరు ఆయన నటించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునే వ్యక్తి గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఇక  చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఇది మెగా అభిమానులకు మాత్రమే కాకుండా సినీ ప్రియులకు అందరికీ పండుగరోజు.

ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు ల కు పోటీగా నిలబడి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన దారి ఎంచుకున్నాడు. అప్పటివరకు మూస దారిలో పోతుండగా సినిమా పరిశ్రమ యొక్క రూపురేఖలు మార్చేశాడు. తన మాటలు, యాక్షన్ సీక్వెన్స్, పాటలు డాన్సులు ఇలా అన్నిటితో తెలుగురాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించి కోట్లాది మంది ప్రేక్షకులను అభిమానులు గా మార్చుకున్నాడు. హెయిర్ స్టైల్ విషయంలో వేసుకునే డ్రెస్సులు విషయంలో కూడా చిరంజీవి ట్రెండ్ క్రియేట్ చేశాడు అని చెప్పవచ్చు.

ఇక సినీ హీరోగానే కాకుండా రియల్ హీరో అని కూడా చాలా సార్లు చిరంజీవి తనను తాను నిరూపించుకున్నాడు. రక్తదానం నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కరోనా సమయంలోనూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి చాలాసార్లు ఫండ్ వసూలు చేసి రాష్ట్రాలలో ఆపద ఉన్న కుటుంబాలకు ప్రాంతాలకు వెచ్చించాడు. ఆక్సిజన్ బ్యాంకులు,కిట్ లు అంటూ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ  ప్రజల్లో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నాడు. కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉన్న మగధీరుడు చిరంజీవి. 


మరింత సమాచారం తెలుసుకోండి: