
టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో నటించబోతున్నారు అని తాజాగా వార్తలు వినపడుతున్నాయి. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ ఖరారు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జూన్ నుండి ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ క్రేజీ కాంబోలో రానున్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నారు అంటూ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. ఈ మూవీలో మహేష్ కి తండ్రిగా అనిల్ కపూర్ నటించబోతున్నారు అంటూ టాక్.
ఈ విషయం అయి దర్శకుడు త్రివిక్రమ్ ముంబై కి వెళ్లి అయితే ఇతనిని ఒప్పించడానికి త్రివిక్రమ్ తెగ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంపై అనిల్ కపూర్ ఏమి చెబుతారో తెలియాల్సి ఉంది. అయితే ఒకవేల అనిల్ కపూర్ ఈ ఛాన్స్ కు ఒకే చెప్పని పరిస్థితుల్లో ఆ పాత్రలో మరొక బాలీవుడ్ సీనియర్ హీరోను అనుకున్నారట మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. కాగా ప్రస్తుతానికి మహేష్ నటించిన సర్కారు వారు పాట మూవీ ఫినిషింగ్ లో ఉంది.