మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా భారీగానే ఓపెన్ అవుతాయని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలకు టికెట్ల ధరలను పెంచుకోవచనే  సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఆచార్య మేకర్స్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అభ్యర్థించారు. దీంతో ఈ సినిమాకి అనుమతులు ఇచ్చిన తర్వాతే అడ్వాన్స్ బుకింగ్ తెరవాలని నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆచార్య సినిమాకు తాజాగా ఒక తీపి కబురు చెప్పినది.. టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తూ సరికొత్త జీవోను విడుదల చేసింది ఆ ప్రభుత్వం. దర్శకనిర్మాతల రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆచార్య సినిమా టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ జీవో ప్రకారం ఒక టికెట్ పై మల్టీప్లెక్స్ లో దాదాపుగా రూ.50 , సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో రూ.30 వరకు పెంచుకునే అవకాశం కలదు. దీంతోపాటుగా వారం రోజులపాటు 5 షో లను ప్రదర్శించు కోవచ్చు. ఇలా జీవో విడుదల చేయడంతో విడుదలైన కొద్దిసేపటికే బుక్ మైషో లో ఆచార్య సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అవ్వడం జరిగిందట. దీంతో మెగా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆచార్య సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి అనుమతులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా టిక్కెట్ల ధరల పై అనుమతి ఇవ్వలేదు. సినిమా విడుదల సమయం మూడు రోజులు కనుక ఈ రోజు రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: