
కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రేపు అనగా జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. అరుల్ శరవణన్ హీరోగా తెరకెక్కిన ద లెజెండ్ మూవీ రేపు అనగా జూలై 28 వ తేదీన విడుదల కాబోతుంది. మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ కి శరత్ మండువ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన రాజిషి విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటించారు.