రామ్‌చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చు కున్నాడు. ఈ ఇమేజ్ ని కాపాడు కునేలా తన తదుపరి సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం రామ్‌చరణ్ జపాన్ "ఆర్ఆర్ఆర్" ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. జపాన్ నుంచి రాగానే చరణ్ న్యూజి లాండ్ కు పయనమ వనున్నాడని తెలుస్తుంది. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కు తున్న ఈ సినిమాకు “అధికారి” అనే టైటిల్ ని పరిశీలి స్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపిం చబోతున్నా డట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక “ఆర్ఆర్ఆర్”లో చూపించిన నట విశ్వరూపానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాడు.
కాగా జపాన్ లో ‘RRR’ ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కి చేరుకున్నారు.
పొరుగు దేశంలో కూడా తనపై చూపిస్తున్న అభిమానానికి చరణ్ సైతం ఆశ్చర్యపో తున్నాడు. ఇటీవల జపాన్ లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి అతిధిగా వెళ్లిన మెగా పవర్ స్టార్ గ్రాండ్ వెల్ కమ్ ని అందుకోవడమే కాకుండా, అభిమానుల నుంచి అందమైన బహుమ తులు కూడా అందుకున్నాడు. తాజాగా జపాన్ లోని ఒక షాప్ కి వెళ్లిన చరణ్, అక్కడ అమ్ముతున్న చాక్లెట్స్ చూసి షాక్ అయ్యాడు.

“చరణ్” పేరుతో ఒక చాక్లెట్ ని అమ్మడం చూసి రామ్‌చరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందుకు సంబం ధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. తన అభిమాన హీరోకి పొరుగు దేశంలో కూడా ఇంతటి అభిమానం దక్కించుకొని, గ్లోబల్ స్టార్ అనిపించు కుంటుంటే.. ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. మరి భవిషత్తులో ఈ స్టార్ ఇంకెంతటి స్థాయికి ఎదుగుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: