ఎంత సంపాదించినా కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కోటి విద్యలు కూడా కూటి కొరకు..ఎంత చేసిన పొట్ట నిండాలి..లేకుంటే కోట్లు ఉన్నా ఎందుకు పనికిరావు. ఇక సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఫామ్ లో ఉన్న ముద్దుగుమ్మలకి డబ్బు విషయంలో లోటు లేదు. కాని ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల సమంత తను 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరోసారి హీరోయిన్లు.. వారికి ఉన్న అరుదైన వ్యాధుల గురించి చర్చ నడుస్తుంది. స్నేహ ఉల్లాల్ అనే హీరోయిన్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతుంది .


ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార..గతంలో ఆమె చేసుకున్న ఓ సర్జరీ కారణంగా చర్మ సంబంధిత వ్యాధితో బాధపుడుతన్నట్టు టాక్. దేవదాస్ సినిమాతో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఇలియానాకి డిస్మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉంది. ఈ విషయాన్ని చాలా సార్లు ఇలియానా చెప్పుకొచ్చింది. ఇక భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.


ఇక అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ డయాబెటీస్తో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పడానికి ఆమె ఏనాడు భయపడలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న దీపికా పదుకొణె గత కొన్నేళ్లుగా డిప్రెషన్తో బాధపడుతూ వస్తుంది.సమంత తన నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడేదట. అందుకే ఆ మధ్య నడుమును ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అది తగ్గిందని తెలియగానే మయోసైటిస్ మొదలైంది. ఇది కండరాలకి సంబంధించింది కావడంతో ఏ పని చేసినా తీవ్ర అలసట వచ్చేస్తుంది. ఇక తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఓ వ్యాధితో బాధపడింది. టాక్సీవాలా మూవీ రిలీజైన తర్వాత తాను థైరాయిడ్ సమస్యతో బాధ పడ్డానని ఆ సమస్య వల్ల తాను లావయ్యానని ప్రియాంక ఓ సారి చెప్పుకొచ్చింది..అయితే భయంకరమైన వ్యాధులతో బయట పడిన వాళ్ళు కొందరైతే.. పడని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో..


మరింత సమాచారం తెలుసుకోండి: